Paamtavalabo idi paragamga gottavalabo

పాఁతవలపో ఇది పరగఁగ గొత్తవలపో
Language

(॥పల్లవి॥)
పాఁతవలపో ఇది పరగఁగ గొత్తవలపో
యీఁతలు మోఁతలునై యిటువలె నుండెను

(॥పాత॥)
తళుకున నిన్నుఁ జూచి తలవంచుకొనె నాకె
యెలమిఁ దా వావి నీకు నేమౌనో కాని
మలసి యీ భావము మాకుఁ జూడనై తేను
వలపులవలవేసి వంచితీసినట్లుండె

(॥పాత॥)
గక్కన మాటాడఁ బూఁచి కడమదా గుక్కుకొనె
చక్కని మీయిద్దరిలో సన్న రెట్టివో
యిక్కువ లివి మాలోన నెరిఁగి తెలుసుకొంటే
మక్కువమచ్చులు మేపి మంత్రించినట్లుండె

(॥పాత॥)
సెలవుల నిన్ను నవ్వి చేరి కాఁగిటనుఁ గూడె
నలి మీచుట్టరిక మెన్నటిదో కాని
అలమేలు మంగ పతివైన శ్రీవేంకటేశ్వర
యిల మీరే చంద్రుడు వెన్నెలవలె నుండె

(||pallavi||)
pām̐tavalabo idi paragam̐ga gŏttavalabo
yīm̐talu mom̐talunai yiḍuvalĕ nuṁḍĕnu

(||pāda||)
taḽuguna ninnum̐ jūsi talavaṁchugŏnĕ nāgĕ
yĕlamim̐ dā vāvi nīgu nemauno kāni
malasi yī bhāvamu māgum̐ jūḍanai tenu
valabulavalavesi vaṁchidīsinaṭluṁḍĕ

(||pāda||)
gakkana māḍāḍam̐ būm̐si kaḍamadā gukkugŏnĕ
sakkani mīyiddarilo sanna rĕṭṭivo
yikkuva livi mālona nĕrim̐gi tĕlusugŏṁṭe
makkuvamachchulu mebi maṁtriṁchinaṭluṁḍĕ

(||pāda||)
sĕlavula ninnu navvi seri kām̐giḍanum̐ gūḍĕ
nali mīsuṭṭariga mĕnnaḍido kāni
alamelu maṁga padivaina śhrīveṁkaḍeśhvara
yila mīre saṁdruḍu vĕnnĕlavalĕ nuṁḍĕ