Paalavamka seemalo pasidi silaga kuligimdi

పాలవంక సీమలో పసిడి చిలక కులికింది
Year
Language

పల్లవి:

పాలవంక సీమలో పసిడి చిలక కులికింది
పసిడి చిలక కులుకులలో పాలమనసు దొరికింది

పాలవంక సీమలో గోరువంక వాలింది
గోరువంక పలుకలలో దోర వలపు దొరికింది

చరణం 1:

రెక్కా రెక్కా ఆనించి ...రేయి పగలు విహరించి
రెక్కా రెక్కా ఆనించి ...రేయి పగలు విహరించి
మిన్నులలో ఎగిసింది ...అది వెన్నెలలో తడిసినది
మిన్నులలో ఎగిసింది... అది వెన్నెలలో తడిసినది

ఆ ...కోరికలూరే ఆ జంట ...ఆరని ఆశల చలి మంట
కోరికలూరే ఆ జంట ...ఆరని ఆశల చలి మంట ..
చల్లారని ఆశల ...చలి మంట !

పాలవంక సీమలో గోరువంక వాలింది
గోరువంక పలుకలలో దోర వలపు దొరికింది

చరణం 2:

పచ్చని చిలకను చేరగనే... వెచ్చగ ఒదిగెను గోరింక
పచ్చని చిలకను చేరగనే ...వెచ్చగ ఒదిగెను గోరింక
ముద్దుల జంటను చూడగనే... ముసిముసి నవ్వును నెలవంక
ముద్దుల జంటను చూడగనే... ముసిముసి నవ్వును నెలవంక

ఆ... కలకలాలాడే ఆ జంట... కమ్మని వలపుల తొలి పంట
కలకలా లాడే ఆ జంట... కమ్మని వలపుల తొలి పంట...
కమ్మని వలపుల ...తొలి పంట !

పాలవంక సీమలో పసిడి చిలక కులికింది
పసిడి చిలక కులుకులలో పాలమనసు దొరికింది

pallavi:

pālavaṁka sīmalo pasiḍi silaga kuligiṁdi
pasiḍi silaga kulugulalo pālamanasu dŏrigiṁdi

pālavaṁka sīmalo goruvaṁka vāliṁdi
goruvaṁka palugalalo dora valabu dŏrigiṁdi

saraṇaṁ 1:

rĕkkā rĕkkā āniṁchi ...reyi pagalu vihariṁchi
rĕkkā rĕkkā āniṁchi ...reyi pagalu vihariṁchi
minnulalo ĕgisiṁdi ...adi vĕnnĕlalo taḍisinadi
minnulalo ĕgisiṁdi... adi vĕnnĕlalo taḍisinadi

ā ...korigalūre ā jaṁṭa ...ārani āśhala sali maṁṭa
korigalūre ā jaṁṭa ...ārani āśhala sali maṁṭa ..
sallārani āśhala ...sali maṁṭa !

pālavaṁka sīmalo goruvaṁka vāliṁdi
goruvaṁka palugalalo dora valabu dŏrigiṁdi

saraṇaṁ 2:

pachchani silaganu seragane... vĕchchaga ŏdigĕnu goriṁka
pachchani silaganu seragane ...vĕchchaga ŏdigĕnu goriṁka
muddula jaṁṭanu sūḍagane... musimusi navvunu nĕlavaṁka
muddula jaṁṭanu sūḍagane... musimusi navvunu nĕlavaṁka

ā... kalagalālāḍe ā jaṁṭa... kammani valabula tŏli paṁṭa
kalagalā lāḍe ā jaṁṭa... kammani valabula tŏli paṁṭa...
kammani valabula ...tŏli paṁṭa !

pālavaṁka sīmalo pasiḍi silaga kuligiṁdi
pasiḍi silaga kulugulalo pālamanasu dŏrigiṁdi