Paala raadi mamdiraana padadi bomma amdam

పాల రాతి మందిరాన పడతి బోమ్మ అందం
Year
Language

పల్లవి:

పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం
అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం
పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం...

చరణం 1:

రతనాల కోట ఉంది రాచకన్నె లేదు
రంగైన తోట ఉంది రామచిలుక లేదు
ఆ రాచ కన్నెవు నీవై అలరిస్తే అందం
నా రామచిలుకవు నీవై నవ్వితే అందం
పాలరాతి మందిరానా పడతిబోమ్మ అందం...
పాలరాతి మందిరానా పడతిబోమ్మ అందం...

చరణం 2:

కన్నెమనసు ఏనాడూ సన్నజాజి తీగ...
తోడు లేని మరునాడూ.. వాడి పోవు కాదా
ఆ తీగకు పందిరి నీవై అందుకుంటే అందం...
ఆ కన్నెకు తోడుగ నిలిచి అల్లుకుంటే అందం...

పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం
అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం
పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం...

చరణం 3:

నీ సోగకన్నుల పైనా బాస చేసినాను
నిండు మనసు కోవెలలోనా నిన్ను దాచినాను...
ఇరువురిని ఏకం చేసే ఈ రాగబంధం ...
ఎన్నెన్ని జన్మలకైనా చెరిగి పోని అందం...
చెలుని వలపు నింపుకున్న చెలియ బ్రతుకు అందం...
అనురాగ గీతిలోనా అచ్చ తెలుగు అందం..లా.ల.లా..ల

pallavi:

pālarādi maṁdirāna paḍadibomma aṁdaṁ
anurāga gīdilona achcha tĕlugu aṁdaṁ
pālarādi maṁdirāna paḍadibomma aṁdaṁ...

saraṇaṁ 1:

radanāla koḍa uṁdi rāsagannĕ ledu
raṁgaina toḍa uṁdi rāmasiluga ledu
ā rāsa kannĕvu nīvai alariste aṁdaṁ
nā rāmasilugavu nīvai navvide aṁdaṁ
pālarādi maṁdirānā paḍadibomma aṁdaṁ...
pālarādi maṁdirānā paḍadibomma aṁdaṁ...

saraṇaṁ 2:

kannĕmanasu enāḍū sannajāji tīga...
toḍu leni marunāḍū.. vāḍi povu kādā
ā tīgagu paṁdiri nīvai aṁduguṁṭe aṁdaṁ...
ā kannĕgu toḍuga nilisi alluguṁṭe aṁdaṁ...

pālarādi maṁdirāna paḍadibomma aṁdaṁ
anurāga gīdilona achcha tĕlugu aṁdaṁ
pālarādi maṁdirāna paḍadibomma aṁdaṁ...

saraṇaṁ 3:

nī sogagannula painā bāsa sesinānu
niṁḍu manasu kovĕlalonā ninnu dāsinānu...
iruvurini egaṁ sese ī rāgabaṁdhaṁ ...
ĕnnĕnni janmalagainā sĕrigi poni aṁdaṁ...
sĕluni valabu niṁpugunna sĕliya bradugu aṁdaṁ...
anurāga gīdilonā achcha tĕlugu aṁdaṁ..lā.la.lā..la