పల్లవి:
పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీ
నీ గుండెల్లో నిండి వున్నదీ ఈ బండల్లో పలుకుతున్నదీ ||2||
నీ ఆర్టు చూసి హార్టు బీటు రూటు మార్చి కొట్టుకుంటు
ఆహా ఓహో అంటున్నదీ, అది ఆహా ఓహో అంటున్నదీ
చరణం 1:
ఈ ఇలలోనా శిలపైన కొలువైనా వాణి
వరవీణ మృదుపాణి వనరుహ లోచను రాణి ||2||
నల్లనయ్యా.. పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా ||2||
పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా (2)
నల్లనయ్యా...
చరణం 2:
అందమైన సుందరాంగులూ యెందరికో నెలవైన రాణివాసము
ఈ కోటలోన దాగి వున్నదీ నాటీ ప్రేమగాధలెన్నొ కన్నది ||2||
హిస్టరీల మిస్టులోన మిస్టరీని చాటిచెప్పి
ఆహా ఓహో అంటూన్నదీ
అది ఆహా ఓహో అంటూన్నదీ..
చరణం 3:
రాసలీలా.. రాధహేల ||2||
రసమయమై సాగు వేళా
తరుణుల తనువులు వెన్నెల తరగలుగా ఊగు వేళా
నురుగులు పరుగులుగా సాగే యమునా నది ఆగు వేళ
నింగినేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే ||2||
నల్లనయ్యా.. పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా
లా లా లా లా లా...
pallavi:
pāḍallo pāḍalenidī noḍi māḍallo sĕppalenidī
nī guṁḍĕllo niṁḍi vunnadī ī baṁḍallo palugudunnadī ||2||
nī ārṭu sūsi hārṭu bīḍu rūḍu mārsi kŏṭṭuguṁṭu
āhā oho aṁṭunnadī, adi āhā oho aṁṭunnadī
saraṇaṁ 1:
ī ilalonā śhilabaina kŏluvainā vāṇi
varavīṇa mṛdubāṇi vanaruha losanu rāṇi ||2||
nallanayyā.. pillanagrovinūdā vĕlluvai yĕda pŏṁgibodā ||2||
pāḍa viṁṭū logamaṁtā rādi bŏmmai nilisibodā (2)
nallanayyā...
saraṇaṁ 2:
aṁdamaina suṁdarāṁgulū yĕṁdarigo nĕlavaina rāṇivāsamu
ī koḍalona dāgi vunnadī nāḍī premagādhalĕnnŏ kannadi ||2||
hisṭarīla misṭulona misṭarīni sāḍisĕppi
āhā oho aṁṭūnnadī
adi āhā oho aṁṭūnnadī..
saraṇaṁ 3:
rāsalīlā.. rādhahela ||2||
rasamayamai sāgu veḽā
taruṇula tanuvulu vĕnnĕla taragalugā ūgu veḽā
nurugulu parugulugā sāge yamunā nadi āgu veḽa
niṁginelā vāgū vaṁkā sitraṁgā sittaruvāye ||2||
nallanayyā.. pillanagrovinūdā vĕlluvai yĕda pŏṁgibodā
lā lā lā lā lā...