ఓయమ్మా తనపొందు వొల్లకుందునా
(॥పల్లవి॥)
ఓయమ్మా తనపొందు వొల్లకుందునా
చేయివట్టి తీయనేలే చెలులు నన్నిపుడు
(॥ఓయ॥)
దగ్గరి మాటాడ నాకుఁ దడవా తనతోను
యెగ్గుదప్పులౌనని యెంచేఁ గాక
నిగ్గులసరస మాడనేరనా కొంతైనా
సిగ్గరితనాన కేనేఁ జింతించేఁ గాక
(॥ఓయ॥)
సొలపుఁ జూపులఁ దన్నుఁ జూచు టరుదాతన-
తలఁపు దెలియలేక దాఁగే గాక
సెలవినవ్వు దనపై చిలికించనేరనా
కొలఁదిమీరునోయని కొంకే గాక
(॥ఓయ॥)
కాఁగిలించి ఇట్లనె కరఁగించకుందనా
మూఁగినయాసలు చూపి మోఁపితిఁగాక
తోఁగెను చెమట నాకుఁ దోడనె శ్రీ వేంకటేశ
ఆఁగి రతిఁ జొక్కించితి వందుకే కాక
(||pallavi||)
oyammā tanabŏṁdu vŏllaguṁdunā
seyivaṭṭi tīyanele sĕlulu nannibuḍu
(||oya||)
daggari māḍāḍa nāgum̐ daḍavā tanadonu
yĕggudappulaunani yĕṁchem̐ gāga
niggulasarasa māḍaneranā kŏṁtainā
siggaridanāna kenem̐ jiṁtiṁchem̐ gāga
(||oya||)
sŏlabum̐ jūbulam̐ dannum̐ jūsu ṭarudādana-
talam̐pu dĕliyalega dām̐ge gāga
sĕlavinavvu danabai siligiṁchaneranā
kŏlam̐dimīrunoyani kŏṁke gāga
(||oya||)
kām̐giliṁchi iṭlanĕ karam̐giṁchaguṁdanā
mūm̐ginayāsalu sūbi mom̐pidim̐gāga
tom̐gĕnu sĕmaḍa nāgum̐ doḍanĕ śhrī veṁkaḍeśha
ām̐gi radim̐ jŏkkiṁchidi vaṁduge kāga