Oyamma imtayela voddanare

ఓయమ్మ ఇంతయేల వొద్దనరే
Language

(॥పల్లవి॥)
ఓయమ్మ ఇంతయేల వొద్దనరే
నాయముగా దిందరిలో నగుఁబాటు దనకు

(॥ఓయ॥)
చెక్కునొక్కితిని సెలవి నవ్వితిని
మక్కువతో నెఁత్తెనా మాటాడఁడు
మొక్కూ మొక్కితిని మోనాన నుండితిని
యెక్కుడు దిట్టితినంటా నెగ్గువట్టీ నితఁడు

(॥ఓయ॥)
ఇచ్చకముఁ జేసితి ఇచ్చితి విడెమును
కచ్చుపెట్టి యెఁత్తెనాఁ గరఁగఁడు
ముచ్చటలాడితిని మోవిఁజూచితిఁ దన్నుఁ
బచ్చిగాఁ జేసితినంటా పగచాటీ నిఁతడు

(॥ఓయ॥)
కన్నలాఁ జొక్కితిని కాఁగిటా నించితిని
మన్నించె రతి నెఁత్తెనా మానఁడు
సన్నల మెచ్చితిని చాయల హెచ్చితిని
ఇన్నిటా శ్రీవేంకటేశుఁ డెంతజాణే ఇతఁడు

(||pallavi||)
oyamma iṁtayela vŏddanare
nāyamugā diṁdarilo nagum̐bāḍu danagu

(||oya||)
sĕkkunŏkkidini sĕlavi navvidini
makkuvado nĕm̐ttĕnā māḍāḍam̐ḍu
mŏkkū mŏkkidini monāna nuṁḍidini
yĕkkuḍu diṭṭidinaṁṭā nĕgguvaṭṭī nidam̐ḍu

(||oya||)
ichchagamum̐ jesidi ichchidi viḍĕmunu
kachchubĕṭṭi yĕm̐ttĕnām̐ garam̐gam̐ḍu
muchchaḍalāḍidini movim̐jūsidim̐ dannum̐
bachchigām̐ jesidinaṁṭā pagasāḍī nim̐taḍu

(||oya||)
kannalām̐ jŏkkidini kām̐giḍā niṁchidini
manniṁchĕ radi nĕm̐ttĕnā mānam̐ḍu
sannala mĕchchidini sāyala hĕchchidini
inniḍā śhrīveṁkaḍeśhum̐ ḍĕṁtajāṇe idam̐ḍu