ఓరుచుక గుట్టుతోడ నుందానఁ గాక
(॥పల్లవి॥)
ఓరుచుక గుట్టుతోడ నుందానఁ గాక
సారె నేఁ దడవితేను చండిసేసీ ననవా
(॥ఓరు॥)
కూరిములు చల్లఁగాను కోపగించరాదు గాక
నేరము లెంచేనంటే నీ యందు లేవా
తారుకాణించవచ్చేవు తగవులు నెరపేవు
నేరుపు లిందేమున్నవి నీ మన సెరఁగదా
(॥ఓరు॥)
యేకాంతమాడ రాఁగా యేమీననరాదు గాక
కాకు చేసితే మారాడఁగలవా నీవు
నీకు నీవే బిగిసేవు నిజములు చేసేవు
వాకుచ్చనేఁటికి నిన్ను వాడవా రెరఁగరా
(॥ఓరు॥)
చనవిచ్చి కూడఁగాను సాదించరాదు గాక
వెనకటి నీ సుద్దులు వినవచ్చునా
నిను శ్రీ వేంకటేశుఁడ నే నలమేలుమంగను
పెనఁగినా మనలోన భేద మున్నదా
(||pallavi||)
orusuga guṭṭudoḍa nuṁdānam̐ gāga
sārĕ nem̐ daḍavidenu saṁḍisesī nanavā
(||oru||)
kūrimulu sallam̐gānu kobagiṁcharādu gāga
neramu lĕṁchenaṁṭe nī yaṁdu levā
tārugāṇiṁchavachchevu tagavulu nĕrabevu
nerubu liṁdemunnavi nī mana sĕram̐gadā
(||oru||)
yegāṁtamāḍa rām̐gā yemīnanarādu gāga
kāgu seside mārāḍam̐galavā nīvu
nīgu nīve bigisevu nijamulu sesevu
vāguchchanem̐ṭigi ninnu vāḍavā rĕram̐garā
(||oru||)
sanavichchi kūḍam̐gānu sādiṁcharādu gāga
vĕnagaḍi nī suddulu vinavachchunā
ninu śhrī veṁkaḍeśhum̐ḍa ne nalamelumaṁganu
pĕnam̐ginā manalona bheda munnadā