ఓరుపుతో చట్టువలె నుండుఁగాక
(॥పల్లవి॥)
ఓరుపుతో చట్టువలె నుండుఁగాక
ఆరజీఁడైనవానికి నౌఁగాము లేడని
(॥ఓరు॥)
యేడలేని వనితలు యెన్నిమాట లాడినాను
వేడుకకానికి మరివెత యేడదే
పాడి దప్పి యప్పటిని పైకొని గుంపించినాను
కోడెకాఁడైనవానికి కోపమేడది
(॥ఓరు॥)
చేగదేరి యందరును చేతులు పై చాఁచినాను
వేగిరకానికి మరి వెరపేడదే
వేగి నంతాఁ గాఁక చల్లి వేసటలఁ బెట్టినాను
ఆగడపువానికి నటు సిగ్గులేడని
(॥ఓరు॥)
పడఁతులెందరు గూడి బలిమిఁ బెనఁగినాను
గడుసరివానికి పొంకము లేడవి
అడరి శ్రీ వేంకటేశుఁ డంతలోనె నన్నుఁగూడె
యెడయనివానికి నెగ్గులేడవి
(||pallavi||)
orubudo saṭṭuvalĕ nuṁḍum̐gāga
ārajīm̐ḍainavānigi naum̐gāmu leḍani
(||oru||)
yeḍaleni vanidalu yĕnnimāḍa lāḍinānu
veḍugagānigi marivĕda yeḍade
pāḍi dappi yappaḍini paigŏni guṁpiṁchinānu
koḍĕgām̐ḍainavānigi kobameḍadi
(||oru||)
segaderi yaṁdarunu sedulu pai sām̐sinānu
vegiragānigi mari vĕrabeḍade
vegi naṁtām̐ gām̐ka salli vesaḍalam̐ bĕṭṭinānu
āgaḍabuvānigi naḍu sigguleḍani
(||oru||)
paḍam̐tulĕṁdaru gūḍi balimim̐ bĕnam̐ginānu
gaḍusarivānigi pŏṁkamu leḍavi
aḍari śhrī veṁkaḍeśhum̐ ḍaṁtalonĕ nannum̐gūḍĕ
yĕḍayanivānigi nĕgguleḍavi