ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు
పల్లవి:
ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు
ఊహకే అందదే అసలేమైందో నాకు
ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు
ఊహకే అందదే అసలేమైందో నాకు
ఏనాడో ఇది తప్పదే అనుకుంటూనే ఉన్నా
ఈనాడే ఇలా ఎదురై ఏదో అయిపోతున్నా
ఔననా కాదనా అతనేదో అన్నాడు
ఆగనా సాగనా అంటోంది నా ఈడు
చరణం 1:
రోజు అలవాటైనా తనకేసి చూడాలంటే
మరి ఈ రోజేమో బిడియంగా ఉందమ్మా
ఇన్నాళ్ళు ఎప్పుడైనా ఈ సిగ్గులు తెలిసొచ్చేనా
తనచూపుల్లోనే ఏదో మాయుందమ్మా
అడుగుల అలికిడి వింటే ఎందుకు అలజడి అంటే
ఏం చెప్పేదమ్మా నిలువునా గిలిగింతలు రేపాడే
ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు
ఊహకే అందదే అసలేమైందో నాకు
చరణం 2:
ఛీ ఛీ పోవే పైటా నీకేమొచ్చిందీపూట
ఈ బరువంతా ఇన్నళ్ళేమయ్యిందంటా
ఏదో ఆరాటంతో ఎద కంగారవుతూ ఉంటే
ఇది హాయో కాదో చెప్పేవాళ్ళెవరంటా
తానే కనబడకుంటే ప్రాణం నిలబడదంటూ
ఒట్టేసి మరీ అతనికి చెప్పాలనిపిస్తోంది
ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు
ఊహకే అందదే ఏదో అయిపోతున్నా
ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు
ఊహకే అందదే అసలేమైందో నాకు
pallavi:
ūrige uṁḍade uyyālūge manasu
ūhage aṁdade asalemaiṁdo nāgu
ūrige uṁḍade uyyālūge manasu
ūhage aṁdade asalemaiṁdo nāgu
enāḍo idi tappade anuguṁṭūne unnā
īnāḍe ilā ĕdurai edo ayibodunnā
aunanā kādanā adanedo annāḍu
āganā sāganā aṁṭoṁdi nā īḍu
saraṇaṁ 1:
roju alavāḍainā tanagesi sūḍālaṁṭe
mari ī rojemo biḍiyaṁgā uṁdammā
innāḽḽu ĕppuḍainā ī siggulu tĕlisŏchchenā
tanasūbullone edo māyuṁdammā
aḍugula aligiḍi viṁṭe ĕṁdugu alajaḍi aṁṭe
eṁ sĕppedammā niluvunā giligiṁtalu rebāḍe
ūrige uṁḍade uyyālūge manasu
ūhage aṁdade asalemaiṁdo nāgu
saraṇaṁ 2:
shī shī pove paiḍā nīgemŏchchiṁdībūḍa
ī baruvaṁtā innaḽḽemayyiṁdaṁṭā
edo ārāḍaṁto ĕda kaṁgāravudū uṁṭe
idi hāyo kādo sĕppevāḽḽĕvaraṁṭā
tāne kanabaḍaguṁṭe prāṇaṁ nilabaḍadaṁṭū
ŏṭṭesi marī adanigi sĕppālanibistoṁdi
ūrige uṁḍade uyyālūge manasu
ūhage aṁdade edo ayibodunnā
ūrige uṁḍade uyyālūge manasu
ūhage aṁdade asalemaiṁdo nāgu