ఊరకున్నవానినేల వొడి వట్టుకొమ్మనీనే
(॥పల్లవి॥)
ఊరకున్నవానినేల వొడి వట్టుకొమ్మనీనే
మేరమీరి యీ తగవు మీరే యెరుఁగుదురే
(॥ఊర॥)
నగినపతితో మారునగితే నమరునే
తగిలి చేయిచాఁచితే తమకించవచ్చునే
మొగము చూచితేను మొక్కవచ్చునేమరి
మొగి నింటికి వచ్చితే మోహించఁ జెల్లునే
(॥ఊర॥)
వొనరఁ బిలిచితేను వూఁకొనఁగఁదగునే
మనసు రా మాటాడితే మాటాడఁబొసఁగునే
యెనసి పొందుసేసితే ఇచ్చగించఁబాడియౌనే
చెనకితే వలపులఁ జెలరేఁగు టొప్పునే
(॥ఊర॥)
కాఁపురము సేసితేను కానిమ్మనఁ జొప్పడునే
పై పై నాసగించితే బాఁతిపడనగునే
యేపున శ్రీవేంకటేశుఁడింతలోఁ దానన్నుఁగూడె
తీపుల మోవి యొసఁగితే మెచ్చఁగూడునే
(||pallavi||)
ūragunnavāninela vŏḍi vaṭṭugŏmmanīne
meramīri yī tagavu mīre yĕrum̐gudure
(||ūra||)
naginabadido mārunagide namarune
tagili seyisām̐side tamagiṁchavachchune
mŏgamu sūsidenu mŏkkavachchunemari
mŏgi niṁṭigi vachchide mohiṁcham̐ jĕllune
(||ūra||)
vŏnaram̐ bilisidenu vūm̐kŏnam̐gam̐dagune
manasu rā māḍāḍide māḍāḍam̐bŏsam̐gune
yĕnasi pŏṁduseside ichchagiṁcham̐bāḍiyaune
sĕnagide valabulam̐ jĕlarem̐gu ṭŏppune
(||ūra||)
kām̐puramu sesidenu kānimmanam̐ jŏppaḍune
pai pai nāsagiṁchide bām̐tibaḍanagune
yebuna śhrīveṁkaḍeśhum̐ḍiṁtalom̐ dānannum̐gūḍĕ
tībula movi yŏsam̐gide mĕchcham̐gūḍune