Ooragunnadaaninela vubbu remsevu

ఊరకున్నదానినేల వుబ్బు రేఁచేవు
Language

(॥పల్లవి॥)
ఊరకున్నదానినేల వుబ్బు రేఁచేవు
నేరుచుఁ జుమ్మీ యాకె నీ మతి గరఁచను

(॥ఊర॥)
నిక్కిచూచెనంటాను నిమ్మ పంటవేసేవు
వుక్కుగుబ్బల నిన్నాకె వొత్తీఁ జుమ్మీ
మొక్కఁగాను కొనగోరు మోచెనంటాఁగెరలేవు
చిక్కించుక నీపైఁ దాను చేఇ చాఁచీఁజుమ్మీ

(॥ఊర॥)
కల కల నవ్వెనంటా కప్పురము చల్లేవు
నెలఁత జవ్వాది నీపైఁ నించీఁ రజుమ్మీ
కొలువులో పయ్యదకొంగు దాఁకెనంటాఁ దిట్టే -
వలరి మారుకుమారు అననోపుఁ జుమ్మీ

(॥ఊర॥)
కందువకు వచ్చెనంటా కాఁగిట బిగించేవు
కిందుపడ నిన్ను రతి గెలిచీఁ జుమ్మీ
అందపు శ్రీవేంకటేశ యలమేలుమంగ యాకె
అందికూడితి విట్టె ని న్నగ్గళించేఁ జుమ్మీ

(||pallavi||)
ūragunnadāninela vubbu rem̐sevu
nerusum̐ jummī yāgĕ nī madi garam̐sanu

(||ūra||)
nikkisūsĕnaṁṭānu nimma paṁṭavesevu
vukkugubbala ninnāgĕ vŏttīm̐ jummī
mŏkkam̐gānu kŏnagoru mosĕnaṁṭām̐gĕralevu
sikkiṁchuga nībaim̐ dānu sei sām̐sīm̐jummī

(||ūra||)
kala kala navvĕnaṁṭā kappuramu sallevu
nĕlam̐ta javvādi nībaim̐ niṁchīm̐ rajummī
kŏluvulo payyadagŏṁgu dām̐kĕnaṁṭām̐ diṭṭe -
valari mārugumāru ananobum̐ jummī

(||ūra||)
kaṁduvagu vachchĕnaṁṭā kām̐giḍa bigiṁchevu
kiṁdubaḍa ninnu radi gĕlisīm̐ jummī
aṁdabu śhrīveṁkaḍeśha yalamelumaṁga yāgĕ
aṁdigūḍidi viṭṭĕ ni nnaggaḽiṁchem̐ jummī