Ooragunnaabenu neeve vokkakkade remsidivi

ఊరకున్నాపెను నీవే వొక్కక్కటే రేఁచితివి
Language

(॥పల్లవి॥)
ఊరకున్నాపెను నీవే వొక్కక్కటే రేఁచితివి
గారవపు టీపెవల్లఁ గడమ లే దెందును

(॥ఊర॥)
కిలకిల నవ్వఁగాఁబో కెరవి నీ జవరాలు
కెలసి బొమ్మల జంకించె నిన్నును
బలిమిఁ జెనకఁగాఁబో పక్కనఁ దప్పించుకొని
సొలసి నిట్ట చూపులఁ జూచె నిన్నును

(॥ఊర॥)
పంతము లాడఁగఁబో పచ్చిదేర చెవిలోన
మంతనాన నొట్టువెట్టి మాఁటలాడెను
పొంత జన్ను లంటఁగాఁబో పొంచి కొప్పువట్టి తీసి
కొంత గొంతములు వాఁడిగోర నూఁదె నిన్నును

(॥ఊర॥)
మోవి తెనెడుగఁగాఁబో మొక్కలాన బైకొని
కావరాన నీ మోవి గంటిసేసెను
యీవేళ శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి
కైవశమై వుండఁగాఁబో కడు మెచ్చె నిన్నును

(||pallavi||)
ūragunnābĕnu nīve vŏkkakkaḍe rem̐sidivi
gāravabu ṭībĕvallam̐ gaḍama le dĕṁdunu

(||ūra||)
kilagila navvam̐gām̐bo kĕravi nī javarālu
kĕlasi bŏmmala jaṁkiṁchĕ ninnunu
balimim̐ jĕnagam̐gām̐bo pakkanam̐ dappiṁchugŏni
sŏlasi niṭṭa sūbulam̐ jūsĕ ninnunu

(||ūra||)
paṁtamu lāḍam̐gam̐bo pachchidera sĕvilona
maṁtanāna nŏṭṭuvĕṭṭi mām̐ṭalāḍĕnu
pŏṁta jannu laṁṭam̐gām̐bo pŏṁchi kŏppuvaṭṭi tīsi
kŏṁta gŏṁtamulu vām̐ḍigora nūm̐dĕ ninnunu

(||ūra||)
movi tĕnĕḍugam̐gām̐bo mŏkkalāna baigŏni
kāvarāna nī movi gaṁṭisesĕnu
yīveḽa śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ kūḍidivi
kaivaśhamai vuṁḍam̐gām̐bo kaḍu mĕchchĕ ninnunu