ఊరకున్న యాఁటదాని నొరయుటెల్ల
(॥పల్లవి॥)
ఊరకున్న యాఁటదాని నొరయుటెల్ల
కూరిమితో రతిసేయఁ గోరుటే కాదా
(॥ఊర॥)
మాటలాడించినదే మతిలోనియాస గాదా
నాటఁజూచుటే వలపు ననుచగాదా
తేట నవ్వులే పొందుల తెరువు చూపుట గాదా
పాట వాడుటే తమి పైఁ జల్లుట గాదా
(॥ఊర॥)
గక్కనఁ బొలయుటలు కాఁకలు సేయుట గాదా
అక్కరఁ గొనెట మే గుట్టరయఁ గాదా
తక్కరి జాణతనాలే తగులవేసుట గాదా
ఇక్కువఁ బేరడుగుటే ఇంపు రేఁచఁ గాదా
(॥ఊర॥)
కొప్పనెరుసు దీసుటే కూడేటి భావము గాదా
యెప్పుడూ వద్ద నుండుటే ఇన్నియుఁ గాదా
వొప్పుగ శ్రీవేంకటేశ వొకటొకటే సేసి
కప్పి కలసితి విదే కడు నేర్పు గాదా
(||pallavi||)
ūragunna yām̐ṭadāni nŏrayuḍĕlla
kūrimido radiseyam̐ goruḍe kādā
(||ūra||)
māḍalāḍiṁchinade madiloniyāsa gādā
nāḍam̐jūsuḍe valabu nanusagādā
teḍa navvule pŏṁdula tĕruvu sūbuḍa gādā
pāḍa vāḍuḍe tami paim̐ jalluḍa gādā
(||ūra||)
gakkanam̐ bŏlayuḍalu kām̐kalu seyuḍa gādā
akkaram̐ gŏnĕḍa me guṭṭarayam̐ gādā
takkari jāṇadanāle tagulavesuḍa gādā
ikkuvam̐ beraḍuguḍe iṁpu rem̐sam̐ gādā
(||ūra||)
kŏppanĕrusu dīsuḍe kūḍeḍi bhāvamu gādā
yĕppuḍū vadda nuṁḍuḍe inniyum̐ gādā
vŏppuga śhrīveṁkaḍeśha vŏgaḍŏgaḍe sesi
kappi kalasidi vide kaḍu nerbu gādā