Ooragunna numdemgaaga vorubunanu

ఊరకున్న నుండెఁగాక వోరుపునను
Language

(॥పల్లవి॥)
ఊరకున్న నుండెఁగాక వోరుపునను
గారవించి చేకొనినఁ గాదనఁగఁగలవా

(॥ఊర॥)
అలిగినప్పటివేళ ఆయఁబోయగాక నీవు
చల మిట్టె కడదాఁకా సాదించేవా
చెలి నీకుఁ జెల్లినంతం చెల్లదా విభునికి
బలిమిఁ బట్టినను నోపననఁగఁగలవా

(॥ఊర॥)
యెచ్చినకోపపువేళ యేమయిన నాయఁగాక
పెచ్చువెరిగే పదేమే బిగియుచును
యిచ్చట నాతఁడు నిన్ను యింత వేఁడుకొనఁగాను
పచ్చిసేయ నిఁక నంత పలమారుఁ జెల్లునా

(॥ఊర॥)
తడసి యొక్కొకవేళ తప్పుఁదారుఁగాక నీవు
కడదాఁకా నీపంతమే కైకొంటివి
కడఁగి శ్రీతిరువేంకటపతి నన్నుఁ గూడె
అడరి నీవేడుకల కడ్డ మెందూఁ గలదా

(||pallavi||)
ūragunna nuṁḍĕm̐gāga vorubunanu
gāraviṁchi segŏninam̐ gādanam̐gam̐galavā

(||ūra||)
aliginappaḍiveḽa āyam̐boyagāga nīvu
sala miṭṭĕ kaḍadām̐kā sādiṁchevā
sĕli nīgum̐ jĕllinaṁtaṁ sĕlladā vibhunigi
balimim̐ baṭṭinanu nobananam̐gam̐galavā

(||ūra||)
yĕchchinagobabuveḽa yemayina nāyam̐gāga
pĕchchuvĕrige pademe bigiyusunu
yichchaḍa nādam̐ḍu ninnu yiṁta vem̐ḍugŏnam̐gānu
pachchiseya nim̐ka naṁta palamārum̐ jĕllunā

(||ūra||)
taḍasi yŏkkŏgaveḽa tappum̐dārum̐gāga nīvu
kaḍadām̐kā nībaṁtame kaigŏṁṭivi
kaḍam̐gi śhrīdiruveṁkaḍabadi nannum̐ gūḍĕ
aḍari nīveḍugala kaḍḍa mĕṁdūm̐ galadā