ఊరకుంటే నేమందువో వూడిగము సేయనని
(॥పల్లవి॥)
ఊరకుంటే నేమందువో వూడిగము సేయనని
ఆరూఢి నేఁ బైకొంటి ఆయము నీ??? చేతిది
(॥ఊర॥)
చేయెత్తి పిలిచితేను చేరి నే నిలిచితిని
యే యింతిఁ బిలిచితివో యెఱఁగ నేను
వాయెత్తి మాటాడితేనే వడిగా నేమీ యంటి
నీయిచ్చ దెలియఁగాని నేనే సంతోసించితి
(॥ఊర॥)
మున్ను నీవు నవ్వితేనే యొక్కుచు నేనూ నవ్వితి
యెన్నికె లెవ్వతెపై యెఱఁగ నేను
కన్నులు విచ్చి చూచితే గక్కనఁ జెమరించితి
సన్న దెలియదు గాని చనవు చేకొంటిని
(॥ఊర॥)
పానుపుపై నీవుండఁగా పైకొని నేఁ గూడితిని
యీనయము నాకే యౌత యెఱఁగ నేను
పూనితివి వలపులు పొదిగితి నే నన్నియు
దీనికె శ్రీ వేంకటేశ తేఁకువెల్లాఁ గంటివి
(||pallavi||)
ūraguṁṭe nemaṁduvo vūḍigamu seyanani
ārūḍhi nem̐ baigŏṁṭi āyamu nī??? sedidi
(||ūra||)
seyĕtti pilisidenu seri ne nilisidini
ye yiṁtim̐ bilisidivo yĕṟam̐ga nenu
vāyĕtti māḍāḍidene vaḍigā nemī yaṁṭi
nīyichcha dĕliyam̐gāni nene saṁtosiṁchidi
(||ūra||)
munnu nīvu navvidene yŏkkusu nenū navvidi
yĕnnigĕ lĕvvadĕbai yĕṟam̐ga nenu
kannulu vichchi sūside gakkanam̐ jĕmariṁchidi
sanna dĕliyadu gāni sanavu segŏṁṭini
(||ūra||)
pānububai nīvuṁḍam̐gā paigŏni nem̐ gūḍidini
yīnayamu nāge yauda yĕṟam̐ga nenu
pūnidivi valabulu pŏdigidi ne nanniyu
dīnigĕ śhrī veṁkaḍeśha tem̐kuvĕllām̐ gaṁṭivi