ఊరకుండేవే అతనివొరపు లెంచఁగనొద్దు
(॥పల్లవి॥)
ఊరకుండేవే అతనివొరపు లెంచఁగనొద్దు
మేరమీరే పని కాపె మెచ్చు సేసీఁగాని
(॥ఊర॥)
మనకేలే ఆమాట మతిలోనే మఱవవే
కనుఁగొన్నప్పుడే ఆకె కాదనీఁగాని
కొనకేల పారేవే గుట్టున నుంద మతని -
చనవుమిగుల నాకె చంకఁబెట్టిఁగాని
(॥ఊర॥)
తగదేలే పగ చాట తక్కి యాతఁ డెవ్వతితో
నగితే ఆకె చూచి తెగడీఁ గాని
తగవు గాదననేలే దగ్గరివున్నది యాకె
వెగటేమిగలిగాని విడిపించీఁ గాని
(॥ఊర॥)
జాతులేలే యాతనితో జాగునేసినందు కాప
అతనిఁ గాఁ గిటిలోనే అణచీఁ గాని
యేతుల శ్రీవేంకటేశుఁ డింతి నింతనేసి కూడె
బాఁతిపడి మేనెల్లాఁ బచ్చినేసీఁ గాని
(||pallavi||)
ūraguṁḍeve adanivŏrabu lĕṁcham̐ganŏddu
meramīre pani kābĕ mĕchchu sesīm̐gāni
(||ūra||)
managele āmāḍa madilone maṟavave
kanum̐gŏnnappuḍe āgĕ kādanīm̐gāni
kŏnagela pāreve guṭṭuna nuṁda madani -
sanavumigula nāgĕ saṁkam̐bĕṭṭim̐gāni
(||ūra||)
tagadele paga sāḍa takki yādam̐ ḍĕvvadido
nagide āgĕ sūsi tĕgaḍīm̐ gāni
tagavu gādananele daggarivunnadi yāgĕ
vĕgaḍemigaligāni viḍibiṁchīm̐ gāni
(||ūra||)
jādulele yādanido jāgunesinaṁdu kāba
adanim̐ gām̐ giḍilone aṇasīm̐ gāni
yedula śhrīveṁkaḍeśhum̐ ḍiṁti niṁtanesi kūḍĕ
bām̐tibaḍi menĕllām̐ bachchinesīm̐ gāni