Ooragumdave seliya voddigado ramanumdu

ఊరకుండవే చెలియ వొద్దికతో రమణుఁడు
Language

(॥పల్లవి॥)
ఊరకుండవే చెలియ వొద్దికతో రమణుఁడు
చేరి తానే వలెనంటే సేవ సేసేఁగాని

(॥ఊర॥)
సుసరాననేవచ్చినచుట్టరిక మింపుగాక
కొసరఁబోతే మనసు గొంటుడదా
ముసిముసినవ్వులతో ముదులకించేవట
పిసికిపిసికాడితే పిప్పిరేఁగదా

(॥ఊర॥)
వరుతోననిచినవలపు చవౌఁగాక
వొరసి పెనఁగితే మే నుప్పుఁ రేగదా
సరసపుఁ జేఁతలలో సారేకుఁ జల్లేటిచూపు
తిరిగితిరిగి చూచితేఁ దెల్లవారదా

(॥ఊర॥)
కదిసి బిగించితేను కాఁగిలి వేడుకౌఁగాక
వదలితే నడియాస వలఁబెట్టదా
యిదె కూడె శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగను
పదరితే సమరతి పచ్చిదేరదా

(||pallavi||)
ūraguṁḍave sĕliya vŏddigado ramaṇum̐ḍu
seri tāne valĕnaṁṭe seva sesem̐gāni

(||ūra||)
susarānanevachchinasuṭṭariga miṁpugāga
kŏsaram̐bode manasu gŏṁṭuḍadā
musimusinavvulado mudulagiṁchevaḍa
pisigibisigāḍide pippirem̐gadā

(||ūra||)
varudonanisinavalabu savaum̐gāga
vŏrasi pĕnam̐gide me nuppum̐ regadā
sarasabum̐ jem̐talalo sāregum̐ jalleḍisūbu
tirigidirigi sūsidem̐ dĕllavāradā

(||ūra||)
kadisi bigiṁchidenu kām̐gili veḍugaum̐gāga
vadalide naḍiyāsa valam̐bĕṭṭadā
yidĕ kūḍĕ śhrīveṁkaḍeśhum̐ ḍalamel‌maṁganu
padaride samaradi pachchideradā