Ooragela sigguvade vubaayaalu nem jeppide

ఊరకేల సిగ్గువడే వుపాయాలు నేఁ జెప్పితే
Language

(॥పల్లవి॥)
ఊరకేల సిగ్గువడే వుపాయాలు నేఁ జెప్పితే
ఆ రీతి నీ విన్నపము లన్నీఁ జేసుకొనవే

(॥ఊర॥)
జలజాక్షీ నీపిత మజ్జనమింట నున్నావాఁడు
జలక మందియ్యవే సంతోసానను
చెలువుఁడు మైమర్ధన చేయుమనునో యేమో
తలగడయుం జాపాఁ జేత యామఱకువే

(॥ఊర॥)
శిరసారుచుకో నందే చిత్తగించునో యేమో
విరులివె కొంపోవే విడెము గోవే
గరిమ నలసితేను కడుఁజెమరించునేమో
సురటి గందవొడీ నించు కేమరకువే

(॥ఊర॥)
రతికిఁ బిల్చునో యేమో రాననరాదు నీకు
తతి వింతలోఁ బిల్చి తా నిన్నుఁ గూడె
అతఁడు శ్రీవేంకటేశుఁ డలమేల్మంగవు నీవు
చతురుఁడు నన్నూ నేలె సవతుల మౌదుమే

(||pallavi||)
ūragela sigguvaḍe vubāyālu nem̐ jĕppide
ā rīdi nī vinnabamu lannīm̐ jesugŏnave

(||ūra||)
jalajākṣhī nībida majjanamiṁṭa nunnāvām̐ḍu
jalaga maṁdiyyave saṁtosānanu
sĕluvum̐ḍu maimardhana seyumanuno yemo
talagaḍayuṁ jābām̐ jeda yāmaṟaguve

(||ūra||)
śhirasārusugo naṁde sittagiṁchuno yemo
virulivĕ kŏṁpove viḍĕmu gove
garima nalasidenu kaḍum̐jĕmariṁchunemo
suraḍi gaṁdavŏḍī niṁchu kemaraguve

(||ūra||)
radigim̐ bilsuno yemo rānanarādu nīgu
tadi viṁtalom̐ bilsi tā ninnum̐ gūḍĕ
adam̐ḍu śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁgavu nīvu
sadurum̐ḍu nannū nelĕ savadula maudume