Ooragela bhramasevu voginela pogadevu

ఊరకేల భ్రమసేవు వొగినేల పొగడేవు
Language

(॥పల్లవి॥)
ఊరకేల భ్రమసేవు వొగినేల పొగడేవు
నేరమా నేమందరము నీకే తెలిసీని

(॥ఊర॥)
కతలు తొల్లె భూమిఁ గలవె కావా నేఁ డీ
సతి నీతోఁ జెప్పఁగానే చవులాయను
గతులైన చూపులు కన్నుల సాజమే కాదా
తతి నాపె చూడఁగా నీమతి నాటీఁగాక

(॥ఊర॥)
అందరిచ్చేకానుకలు అరచేతిలోవేకావా
ఇందుమఖి యియ్యఁగా నీ కింపాయఁగాక
చిందేటి నవ్వు లింతులసెలవులవే కావా
చెంది యాపె నవ్వఁగా నీ కందమాయఁగాక

(॥ఊర॥)
వింతమొక్కలు లోకులవినోదములే కావా
యింతి మొక్కఁగా రతికెక్కెఁగాక
ఇంతలోన శ్రీవేంకటేశ నన్ను నేలితివి
చెంత నాపెఁ గూడఁగా నచ్చెరువాయఁగాక

(||pallavi||)
ūragela bhramasevu vŏginela pŏgaḍevu
neramā nemaṁdaramu nīge tĕlisīni

(||ūra||)
kadalu tŏllĕ bhūmim̐ galavĕ kāvā nem̐ ḍī
sadi nīdom̐ jĕppam̐gāne savulāyanu
gadulaina sūbulu kannula sājame kādā
tadi nābĕ sūḍam̐gā nīmadi nāḍīm̐gāga

(||ūra||)
aṁdarichchegānugalu arasedilovegāvā
iṁdumakhi yiyyam̐gā nī kiṁpāyam̐gāga
siṁdeḍi navvu liṁtulasĕlavulave kāvā
sĕṁdi yābĕ navvam̐gā nī kaṁdamāyam̐gāga

(||ūra||)
viṁtamŏkkalu logulavinodamule kāvā
yiṁti mŏkkam̐gā radigĕkkĕm̐gāga
iṁtalona śhrīveṁkaḍeśha nannu nelidivi
sĕṁta nābĕm̐ gūḍam̐gā nachchĕruvāyam̐gāga