Oorage yimdarivale numdumugaaga

ఊరకె యిందరివలె నుందుముగాక
Language

(॥పల్లవి॥)
ఊరకె యిందరివలె నుందుముగాక
మారుకొని నిన్నడుగ మాకేల యిఁకను

(॥ఊర॥)
యిచ్చకము లాడేవారి విందు రమ్మందురుగాక
యెచ్చుకుందులాడేవారి నియ్యకుందురా
పచ్చిచేఁతలు నీమేనఁ బాదుకొని వుండితేను
మచ్చికతోఁ జెప్పిచూప మాకేల ఇఁకను

(॥ఊర॥)
మగువలఁ దెచ్చేవారి మన్ననసేతురుగాక
తగుబుద్దిచెప్పేవారిఁ దాము మెచ్చేరా
అగడు సేవేచెలులు అండఁగాచుకుండఁగాను
మగిడి నీ కడ్డమురా మాకేల ఇఁకను

(॥ఊర॥)
వెలయాండ్లయినవారి వేడుక చూతురుగాక
బలిమి నిల్లాండ్లమీఁద బత్తిసేసేరా
యెలమి శ్రీవేంకటేశ యేలితి విప్పుడు నన్ను
మలసి మర్మములెత్త మాకేల యిఁకను

(||pallavi||)
ūragĕ yiṁdarivalĕ nuṁdumugāga
mārugŏni ninnaḍuga māgela yim̐kanu

(||ūra||)
yichchagamu lāḍevāri viṁdu rammaṁdurugāga
yĕchchuguṁdulāḍevāri niyyaguṁdurā
pachchisem̐talu nīmenam̐ bādugŏni vuṁḍidenu
machchigadom̐ jĕppisūba māgela im̐kanu

(||ūra||)
maguvalam̐ dĕchchevāri mannanasedurugāga
tagubuddisĕppevārim̐ dāmu mĕchcherā
agaḍu sevesĕlulu aṁḍam̐gāsuguṁḍam̐gānu
magiḍi nī kaḍḍamurā māgela im̐kanu

(||ūra||)
vĕlayāṁḍlayinavāri veḍuga sūdurugāga
balimi nillāṁḍlamīm̐da battiseserā
yĕlami śhrīveṁkaḍeśha yelidi vippuḍu nannu
malasi marmamulĕtta māgela yim̐kanu