Oorage vunnaam didamdu vorubudoda

ఊరకే వున్నాఁ డితఁడు వోరుపుతోడ
Language

(॥పల్లవి॥)
ఊరకే వున్నాఁ డితఁడు వోరుపుతోడ
ఆ రీతి మాటలాడ అరుహమా ఇపుడు

(॥ఊర॥)
మంతనము లాడెనంటా మగువతో నీవతని
నెంతకెంత సేసేవే ఇప్పడు నీవు
వంతులు దప్పకవుండవచ్చీఁ గాక రమణుఁడు
అంతేసి మాటలకు నరహమా ఇతఁడు

(॥ఊర॥)
అంగనచేతి విడెమాకు నందుకొనె నంటా
యెంగిలి మాటాడకువే యెగసక్కేన
జంగిలిలో నీతోడ సరసము నాడీఁగాక
అంగమంటి ఇంతసేయ నరుహమా ఇతఁడు

(॥ఊర॥)
మేడమీఁదనున్న చెలి మేలమాడి కూడెనంటా
ఆడుకొనే వింతలోనె అందరితోడ
వోడక శ్రీ వేంకటేశుఁ డొడివట్టి నిన్నుఁగూడె
ఆడ నీడా గేలిసేయ నరుహమా ఇతఁడు

(||pallavi||)
ūrage vunnām̐ ḍidam̐ḍu vorubudoḍa
ā rīdi māḍalāḍa aruhamā ibuḍu

(||ūra||)
maṁtanamu lāḍĕnaṁṭā maguvado nīvadani
nĕṁtagĕṁta seseve ippaḍu nīvu
vaṁtulu dappagavuṁḍavachchīm̐ gāga ramaṇum̐ḍu
aṁtesi māḍalagu narahamā idam̐ḍu

(||ūra||)
aṁganasedi viḍĕmāgu naṁdugŏnĕ naṁṭā
yĕṁgili māḍāḍaguve yĕgasakkena
jaṁgililo nīdoḍa sarasamu nāḍīm̐gāga
aṁgamaṁṭi iṁtaseya naruhamā idam̐ḍu

(||ūra||)
meḍamīm̐danunna sĕli melamāḍi kūḍĕnaṁṭā
āḍugŏne viṁtalonĕ aṁdaridoḍa
voḍaga śhrī veṁkaḍeśhum̐ ḍŏḍivaṭṭi ninnum̐gūḍĕ
āḍa nīḍā geliseya naruhamā idam̐ḍu