Oorage vunnaam dade vobiga soobamgavaddaa

ఊరకె వున్నాఁ డదె వోపిక చూపఁగవద్దా
Language

(॥పల్లవి॥)
ఊరకె వున్నాఁ డదె వోపిక చూపఁగవద్దా
నేరుపున నామాట నిజపట్టుఁ గాని

(॥ఊర॥)
సరసమాడేటివాఁడు సంగడికి రావలదా
సొరిదినాగోరిలావు చూచుఁగాని
పొరుగున నున్నవాఁడు పోరచి యడుగవద్దా
సరుస నామోవితీపు చవిచూచుఁగాని

(॥ఊర॥)
యెమ్ములు సేసేటివాఁడు యెదుటనే వుండవద్దా
కమ్మటి నాచేఁతలెల్లాఁగనుగొనుఁగాని
దిమ్మరీఁ డయినవాఁడు తిరుగ మాటాడవద్దా
దొమ్మి నాగబ్బితనము తోడ వినుఁగాని

(॥ఊర॥)
కలసి కూడేటివాఁడు కాఁగిలించుకొనవద్దా
తిలకించి నావలపు తెలుసుఁగాని
యెలమి శ్రీవేంకటేశుఁడింతలోనె నన్ను నేలె
బలిమిఁబెనఁగవద్దా పచ్చిదేరుఁగాని

(||pallavi||)
ūragĕ vunnām̐ ḍadĕ vobiga sūbam̐gavaddā
nerubuna nāmāḍa nijabaṭṭum̐ gāni

(||ūra||)
sarasamāḍeḍivām̐ḍu saṁgaḍigi rāvaladā
sŏridināgorilāvu sūsum̐gāni
pŏruguna nunnavām̐ḍu porasi yaḍugavaddā
sarusa nāmovidību savisūsum̐gāni

(||ūra||)
yĕmmulu seseḍivām̐ḍu yĕduḍane vuṁḍavaddā
kammaḍi nāsem̐talĕllām̐ganugŏnum̐gāni
dimmarīm̐ ḍayinavām̐ḍu tiruga māḍāḍavaddā
dŏmmi nāgabbidanamu toḍa vinum̐gāni

(||ūra||)
kalasi kūḍeḍivām̐ḍu kām̐giliṁchugŏnavaddā
tilagiṁchi nāvalabu tĕlusum̐gāni
yĕlami śhrīveṁkaḍeśhum̐ḍiṁtalonĕ nannu nelĕ
balimim̐bĕnam̐gavaddā pachchiderum̐gāni