ఊరకె వుండుమనవే వోరుచుకుందాన నేను
(॥పల్లవి॥)
ఊరకె వుండుమనవే వోరుచుకుందాన నేను
సారె సారె నీతో నేమి సరసమాడీనే
(॥ఊర॥)
మాఁట లెన్త్నెనాఁ గలవు మళ్ళి మళ్ళి యాడితేను
యేఁటవెట్టి నన్నెంత యెలయించీనే
గాఁటముతో నొక్కసతి కాచుకున్నది వద్దనే
ఆఁటదాన నన్ను నెంత ఆసలఁబెట్టీనే
(॥ఊర॥)
చేఁతలు కోటానఁగోటి సేసి సేసి చూపితేను
బాఁతిపడి యింత యాల భ్రమయించీనే
కాఁతాళానఁ దనతోను కాఁపురాలు సెసీనాపె
వూఁతవట్టుక నన్నెంత వొడఁబరచీనే
(॥ఊర॥)
చెలిమి చేటలకొద్ది చేరి చేరి కూడితేను
నలిరేఁగి నన్ను నెంత నమ్మించీనే
చెలికత్తెయంటాఁ జెప్పి శ్రీవేంకటేశుఁడీకెను
చెలఁగి కూడి నన్నెంత చెక్కులు నొక్కీనే
(||pallavi||)
ūragĕ vuṁḍumanave vorusuguṁdāna nenu
sārĕ sārĕ nīdo nemi sarasamāḍīne
(||ūra||)
mām̐ṭa lĕndnĕnām̐ galavu maḽḽi maḽḽi yāḍidenu
yem̐ṭavĕṭṭi nannĕṁta yĕlayiṁchīne
gām̐ṭamudo nŏkkasadi kāsugunnadi vaddane
ām̐ṭadāna nannu nĕṁta āsalam̐bĕṭṭīne
(||ūra||)
sem̐talu koḍānam̐goḍi sesi sesi sūbidenu
bām̐tibaḍi yiṁta yāla bhramayiṁchīne
kām̐tāḽānam̐ danadonu kām̐purālu sĕsīnābĕ
vūm̐tavaṭṭuga nannĕṁta vŏḍam̐barasīne
(||ūra||)
sĕlimi seḍalagŏddi seri seri kūḍidenu
nalirem̐gi nannu nĕṁta nammiṁchīne
sĕligattĕyaṁṭām̐ jĕppi śhrīveṁkaḍeśhum̐ḍīgĕnu
sĕlam̐gi kūḍi nannĕṁta sĕkkulu nŏkkīne