ఊరకే తెమలునా వుదుటైన నీ మనసు
(॥పల్లవి॥)
ఊరకే తెమలునా వుదుటైన నీ మనసు
తారుకాణలు దెలిసి దయవుట్టీఁ గాక
(॥ఊర॥)
తరుణి గుబ్బలు నిన్నుఁ దాఁకినప్పుడుగదా
మరిగి యాపె చెప్పినమాఁట విందువు
అరిది బొమ్మజంకెన లంటినప్పుడుగదా
వరుసలు దప్పకుండా వత్తువు నీవు
(॥ఊర॥)
నిక్కి సేయరాని చేఁత నిన్ను మోఁచిననుఁ గదా
అక్కరతోఁ జేతికి లోనై వుందువు
కక్కసపుఁ జూపులు కాఁడిపారిననుఁ గదా
తక్కక యాపె నే పొద్దూఁ దలఁతువు నీవు
(॥ఊర॥)
సొలపుఁ బలుకు నిన్ను సోఁకినంతటఁగదా
తలవంచి సిగ్గుతోడ దండవాయపు(వు)
చెలి నేలితి వింతలో శ్రీ వేంకటేశ్వర
కలసి యిట్లైతేఁ గదా కరఁగుదువు నీవు
(||pallavi||)
ūrage tĕmalunā vuduḍaina nī manasu
tārugāṇalu dĕlisi dayavuṭṭīm̐ gāga
(||ūra||)
taruṇi gubbalu ninnum̐ dām̐kinappuḍugadā
marigi yābĕ sĕppinamām̐ṭa viṁduvu
aridi bŏmmajaṁkĕna laṁṭinappuḍugadā
varusalu dappaguṁḍā vattuvu nīvu
(||ūra||)
nikki seyarāni sem̐ta ninnu mom̐sinanum̐ gadā
akkaradom̐ jedigi lonai vuṁduvu
kakkasabum̐ jūbulu kām̐ḍibārinanum̐ gadā
takkaga yābĕ ne pŏddūm̐ dalam̐tuvu nīvu
(||ūra||)
sŏlabum̐ balugu ninnu som̐kinaṁtaḍam̐gadā
talavaṁchi siggudoḍa daṁḍavāyabu(vu)
sĕli nelidi viṁtalo śhrī veṁkaḍeśhvara
kalasi yiṭlaidem̐ gadā karam̐guduvu nīvu