Oorage nannu remsaga vumdaniyyaraa

ఊరకే నన్ను రేఁచక వుండనియ్యరా
Language

(॥పల్లవి॥)
ఊరకే నన్ను రేఁచక వుండనియ్యరా
కోరికెల్లా రాసులైతేఁ గోటానఁగోట్లు

(॥ఊర॥)
చిత్తము నొచ్చీనంటా సెలవి నవ్వితిఁగాని
వొత్తి మేనిక కలైతే వోరువరాదు
బత్తి చెరుచఁగరాక పట్టఁగా లోనైతిఁ గాని
యెత్తిననాసిగ్గులైతే యెన్నెనాఁ గలవు

(॥ఊర॥)
మన సెట్టుండునోయంటా మాట నే నాడితిఁగాని
పెనఁగి పెదవులైతే బెండుపడీని
నను పెట్టానోయంటా నాఁటఁగఁ జూచితిఁ గాక
నినుపు నాయాసలైతే నిండాఁ బండఁగలవు

(॥ఊర॥)
వరుసదప్పీనంటా వాసికిఁ గూడితిఁ గాక
సురతవువలపులు జొబ్బిలీ నిదె
గరిమ శ్రీ వేంకటేశ కలసితి మిద్దరము
పరవశములయితే పట్టరాదు నాకు

(||pallavi||)
ūrage nannu rem̐saga vuṁḍaniyyarā
korigĕllā rāsulaidem̐ goḍānam̐goṭlu

(||ūra||)
sittamu nŏchchīnaṁṭā sĕlavi navvidim̐gāni
vŏtti meniga kalaide voruvarādu
batti sĕrusam̐garāga paṭṭam̐gā lonaidim̐ gāni
yĕttinanāsiggulaide yĕnnĕnām̐ galavu

(||ūra||)
mana sĕṭṭuṁḍunoyaṁṭā māḍa ne nāḍidim̐gāni
pĕnam̐gi pĕdavulaide bĕṁḍubaḍīni
nanu pĕṭṭānoyaṁṭā nām̐ṭam̐gam̐ jūsidim̐ gāga
ninubu nāyāsalaide niṁḍām̐ baṁḍam̐galavu

(||ūra||)
varusadappīnaṁṭā vāsigim̐ gūḍidim̐ gāga
suradavuvalabulu jŏbbilī nidĕ
garima śhrī veṁkaḍeśha kalasidi middaramu
paravaśhamulayide paṭṭarādu nāgu