Oorage nannidu doori vuppadimchevu

ఊరకే నన్నిటు దూరి వుప్పతించేవు
Language

(॥పల్లవి॥)
ఊరకే నన్నిటు దూరి వుప్పతించేవు
యే రీతి తక్కరియౌటా యెఱఁగవు నీవు

(॥॥)
ఆతఁడు వాసులెక్కించి ఆటకానకుఁబెట్టితే
యేతులకుఁగాఁతాళించి యేలచూచేవే
రాతిరిఁబగలుఁ దాను రచ్చ లెందోసేసి వచ్చి
యీతల సటలు సేసే దెఁఱగవు నీవు

(॥॥)
తానే సన్నలు సేసి తగవులఁ బెట్టితేను
పేనిపట్టుక నీవేల పెనఁగాడేవే
ఆనుకొని వాడవారి నందరిఁబెండ్లాడివచ్చి
యీనేరువులు చూపేది యెఱఁగవు నీవు

(॥॥)
శ్రీ వేంకటేశ్వరుఁడు చేరి యిద్దరిఁగూడితే
చేవమీర నీవేల సిగ్గువడేవే
వేవేలుసతులకు వేరేసేసవెట్టివచ్చి
యీవిధాన మొఱఁగేది యెఱఁగవు నీవు

(||pallavi||)
ūrage nanniḍu dūri vuppadiṁchevu
ye rīdi takkariyauḍā yĕṟam̐gavu nīvu

(||||)
ādam̐ḍu vāsulĕkkiṁchi āḍagānagum̐bĕṭṭide
yedulagum̐gām̐tāḽiṁchi yelasūseve
rādirim̐bagalum̐ dānu rachcha lĕṁdosesi vachchi
yīdala saḍalu sese dĕm̐ṟagavu nīvu

(||||)
tāne sannalu sesi tagavulam̐ bĕṭṭidenu
penibaṭṭuga nīvela pĕnam̐gāḍeve
ānugŏni vāḍavāri naṁdarim̐bĕṁḍlāḍivachchi
yīneruvulu sūbedi yĕṟam̐gavu nīvu

(||||)
śhrī veṁkaḍeśhvarum̐ḍu seri yiddarim̐gūḍide
sevamīra nīvela sigguvaḍeve
vevelusadulagu veresesavĕṭṭivachchi
yīvidhāna mŏṟam̐gedi yĕṟam̐gavu nīvu