Oorage mana middari nuppadimche mimtegaaga

ఊరకే మన మిద్దరి నుప్పతించే మింతేకాక
Language

(॥పల్లవి॥)
ఊరకే మన మిద్దరి నుప్పతించే మింతేకాక
వీరెప్పుడూను నొక్కటే వినరమ్మ చెలులు

(॥ఊర॥)
సెలవి నవ్వు నవ్వులు చిత్తము గరఁగించఁగా
పలుకు చుట్టరికెము పైకొలుపఁగా
కలికిచూపులు దమకములు రేఁచఁగాను
వలవ కెట్టుందురమ్మ వనితలుఁ బతులు

(॥ఊర॥)
తక్కక మోవి తేనెలు తరితీపు సేయఁగాను
మక్కువ సరసములు మరిగించఁగా
చక్కఁదనములు లోలో సరి నాస వుట్టించఁగా
చిక్కకెట్టుండుదురమ్మ చెలఁగి దంపతులు

(॥ఊర॥)
కొనగోరిచెనకులు గుట్టు విడిపించఁగాను
తనువులకాఁగిళ్ళు తగిలించఁగా
యెనసి శ్రీవేంకటేశుఁ డీ యలమేలుమంగను
ననుచ కే లుందురమ్మ నాయకీ నాయకులు

(||pallavi||)
ūrage mana middari nuppadiṁche miṁtegāga
vīrĕppuḍūnu nŏkkaḍe vinaramma sĕlulu

(||ūra||)
sĕlavi navvu navvulu sittamu garam̐giṁcham̐gā
palugu suṭṭarigĕmu paigŏlubam̐gā
kaligisūbulu damagamulu rem̐sam̐gānu
valava kĕṭṭuṁduramma vanidalum̐ badulu

(||ūra||)
takkaga movi tenĕlu taridību seyam̐gānu
makkuva sarasamulu marigiṁcham̐gā
sakkam̐danamulu lolo sari nāsa vuṭṭiṁcham̐gā
sikkagĕṭṭuṁḍuduramma sĕlam̐gi daṁpadulu

(||ūra||)
kŏnagorisĕnagulu guṭṭu viḍibiṁcham̐gānu
tanuvulagām̐giḽḽu tagiliṁcham̐gā
yĕnasi śhrīveṁkaḍeśhum̐ ḍī yalamelumaṁganu
nanusa ke luṁduramma nāyagī nāyagulu