ఊరకే కరఁగునా వుక్కురాతిగుండె నీది
(॥పల్లవి॥)
ఊరకే కరఁగునా వుక్కురాతిగుండె నీది
సారెకు విన్నవించఁగా సమ్మతించితివి
(॥ఊర॥)
చెప్పరానియటువంటిసేవలెల్లాఁ జేయఁగాను
తప్పకుండా నేఁడు నీ చిత్తము వచ్చెను
నొప్పుగా నెప్పుడు నీవొద్ద నిట్టె వుండఁగాను
కప్పి యన్నటా నీవుకరుణించితివి
(॥ఊర॥)
యేడలేనియటువంటిఇచ్చలెల్లా నాడఁగాను
వాడలోననెల్లా నాకె వలచితివి
జాడతోడ రేపుమాపు సారెసారె మొక్కఁగాను
యీడులేనిచనవులు యిచ్చితివి నీవు
(॥ఊర॥)
మిక్కిలిరతుఁల గూడి మీఁదమీఁద మెప్పించఁగా
మక్కువదేవులఁగా మన్నించితివి
నిక్కపుశ్రీవేంకటేశ నీవె యిన్నియును నేర్పి
వొక్కటై నన్నేలి మోవి వొసగితిని
(||pallavi||)
ūrage karam̐gunā vukkurādiguṁḍĕ nīdi
sārĕgu vinnaviṁcham̐gā sammadiṁchidivi
(||ūra||)
sĕpparāniyaḍuvaṁṭisevalĕllām̐ jeyam̐gānu
tappaguṁḍā nem̐ḍu nī sittamu vachchĕnu
nŏppugā nĕppuḍu nīvŏdda niṭṭĕ vuṁḍam̐gānu
kappi yannaḍā nīvugaruṇiṁchidivi
(||ūra||)
yeḍaleniyaḍuvaṁṭiichchalĕllā nāḍam̐gānu
vāḍalonanĕllā nāgĕ valasidivi
jāḍadoḍa rebumābu sārĕsārĕ mŏkkam̐gānu
yīḍulenisanavulu yichchidivi nīvu
(||ūra||)
mikkiliradum̐la gūḍi mīm̐damīm̐da mĕppiṁcham̐gā
makkuvadevulam̐gā manniṁchidivi
nikkabuśhrīveṁkaḍeśha nīvĕ yinniyunu nerbi
vŏkkaḍai nanneli movi vŏsagidini