ఒంటి నూరకేలుందాన వోయమ్మ పతి
(॥పల్లవి॥)
ఒంటి నూరకేలుందాన వోయమ్మ పతి
జంట నిన్నుఁ జేయివట్టె సంగడి నుండవమ్మా
(॥ఒంటి॥)
అంగన నీచెక్కు లివి హరికి నద్దములమ్మ
ముంగిటినవ్వులు మంచిముగ్గు లోయమ్మా
అంగవించిననీచూపు లతనికి సొమ్ములమ్మ
పొంగారు మాటలు తేనె బోనము లోయమ్మా
(॥ఒంటి॥)
అతివ నీ వూరుపులె ఆలవట్టము లోయమ్మ
తతి మేనిమెఱుఁగు లారతులమ్మా
మితిలేని నీకుచాలు మెత్తని యొరగులమ్మ
అతనికి నీకౌను వయ్యాళి బయలమ్మా
(॥ఒంటి॥)
తరుణి నీ కరములు తామరల పూజలమ్మ
ధర నీభావ మాతని తల పోయమ్మా
మరిగిన యలమేలుమంగపు శ్రీవేంకటేశుఁ -
డురముపై హారముగా నునిచె నిన్నమ్మా
(||pallavi||)
ŏṁṭi nūrageluṁdāna voyamma padi
jaṁṭa ninnum̐ jeyivaṭṭĕ saṁgaḍi nuṁḍavammā
(||ŏṁṭi||)
aṁgana nīsĕkku livi harigi naddamulamma
muṁgiḍinavvulu maṁchimuggu loyammā
aṁgaviṁchinanīsūbu ladanigi sŏmmulamma
pŏṁgāru māḍalu tenĕ bonamu loyammā
(||ŏṁṭi||)
adiva nī vūrubulĕ ālavaṭṭamu loyamma
tadi menimĕṟum̐gu lāradulammā
midileni nīgusālu mĕttani yŏragulamma
adanigi nīgaunu vayyāḽi bayalammā
(||ŏṁṭi||)
taruṇi nī karamulu tāmarala pūjalamma
dhara nībhāva mādani tala poyammā
marigina yalamelumaṁgabu śhrīveṁkaḍeśhum̐ -
ḍuramubai hāramugā nunisĕ ninnammā