ఒంటరైన గుండెలో తీగలేని వీణలు
పల్లవి:
ఒంటరైన గుండెలో తీగలేని వీణలు మోగుతున్న మూగ రాగమేమో
నిద్రలేని నిన్నని మేలుకోని రేపుని చూపుతున్న నేటి రాతిరేమో
సుదూర తీరాల జ్ఞాపకాలే .. సమీపమౌతున్న జాడలా
ఉండుండి వీచేటి ఈ గాలిలో ..
ఒంటరైన గుండెలో తీగలేని వీణలు ..మోగుతున్న మూగ రాగమేమో
నిద్రలేని నిన్నని మేలుకోని రేపుని ..చూపుతున్న నేటి రాతిరేమో
చరణం 1:
కంటి చాటు సాగరాలు ఇంతకాలమేడ దాగెనో .. అనురాగ సంగమం ఈ క్షణమే
రెప్పదాటు ఉప్పు నీట చెప్పలేని తీపి ఏమిటో .. కరిగించు ఈ క్షణం అమృతమే
సుమాలు తుంచిన గతాల మంచునే .. క్షమించి చేరువైన తేనె జల్లిది
చినుకు వంతెనెంత చేరుకుంది నీలి నింగి నేలకి చిగురు తొడుగు తడిని తెలపదా..
ఏడేడు జన్మాల స్నేహాలతో ... !!
చరణం 2:
వేడి శ్వాస వేణువైన నాడిలోని నాదమేవిటో .. తెలవారు వేళకై స్వాగతమే
ఉడికించు ఆశలోన భాషలేని భావమేవిటో .. ఒడి చేరు ఊసులో సంబరమే
తనంత తానుగా వసంత వాకిట .. ఎడారి దారి చేరి పూల పూయగా
కలల కోకిలమ్మ పాడుతోంది మనసు మావితోటలో చెలిమి చిలుకు చైత్ర గీతికా..
తియ్యంగా తేనీటి దాహాలతో....!!!
pallavi:
ŏṁṭaraina guṁḍĕlo tīgaleni vīṇalu mogudunna mūga rāgamemo
nidraleni ninnani melugoni rebuni sūbudunna neḍi rādiremo
sudūra tīrāla jñābagāle .. samībamaudunna jāḍalā
uṁḍuṁḍi vīseḍi ī gālilo ..
ŏṁṭaraina guṁḍĕlo tīgaleni vīṇalu ..mogudunna mūga rāgamemo
nidraleni ninnani melugoni rebuni ..sūbudunna neḍi rādiremo
saraṇaṁ 1:
kaṁṭi sāḍu sāgarālu iṁtagālameḍa dāgĕno .. anurāga saṁgamaṁ ī kṣhaṇame
rĕppadāḍu uppu nīḍa sĕppaleni tībi emiḍo .. karigiṁchu ī kṣhaṇaṁ amṛtame
sumālu tuṁchina gadāla maṁchune .. kṣhamiṁchi seruvaina tenĕ jallidi
sinugu vaṁtĕnĕṁta seruguṁdi nīli niṁgi nelagi siguru tŏḍugu taḍini tĕlabadā..
eḍeḍu janmāla snehālado ... !!
saraṇaṁ 2:
veḍi śhvāsa veṇuvaina nāḍiloni nādameviḍo .. tĕlavāru veḽagai svāgadame
uḍigiṁchu āśhalona bhāṣhaleni bhāvameviḍo .. ŏḍi seru ūsulo saṁbarame
tanaṁta tānugā vasaṁta vāgiḍa .. ĕḍāri dāri seri pūla pūyagā
kalala kogilamma pāḍudoṁdi manasu māvidoḍalo sĕlimi silugu saitra gīdigā..
tiyyaṁgā tenīḍi dāhālado....!!!