Olele olele ole.. olele olele le

ఓలెలె ఓలెలె ఓలె.. ఓలెలె ఓలెలె లె
Work
Year
Language

పల్లవి:

ఓలెలె ఓలెలె ఓలె.. ఓలెలె ఓలెలె లె...
ఓలెలె ఓలెలె ఓలె.. ఓలెలె ఓలెలె లె...
పారహుషారైన పాట చిటికేసి రమ్మందిరోయ్
పైలాపచ్చీసైన ఆట చిందేసి రమ్మందిరోయ్
ఓరోరి బైరాగి ఈ పొద్దు ఈ జోరు ఆపొద్దు తనివితీరా దరువెయ్యురోయ్
ఊరూర ఊరేగి ఈ డప్పు హోరెత్తి పోయేట్టు ఊపెక్కి పోనీయరోయ్
హేయ్ కష్టాలు కన్నీళ్ళకేలే వస్తూనే వుంటాయిలే
నవ్వంటు తోడుంటే చాల్లే ఏమైనా చెయ్యచ్చులే

చరణం 1:

మందిలో కొందరు రాబందులై
అందిందంతా కాజేసి జైహింద్ అంటారా
అహ ఒహొ అహ ఒహొహో...

మందలై పందలై పసికందులై
జనమంతా తలలొంచేసి ఖర్మనుకుంటారా
బతకడం బరువైయ్యేలా తెగ పీడిస్తుంటే
దారుణం దారులు మూసి వేటాడుతు ఉంటే
ప్రాణం విసిగి పిల్లే అయినా బెబ్బులి అయిపోదా
హేయ్.. చీమంత ఓ చిన్న చినుకే తుఫాను అవుతుందిలే
ఈనాటి ఈ నిప్పు తునకే కార్చిచ్చు అవుతుందిలే

చరణం 2:

చిక్కగా చీకటే కమ్మిందని
లోకం వెళ్ళి సూర్యుణ్ణి రారమ్మని పిలవాలా
కొండలా పాపమే పెరిగిందని
కాపాడంటూ ఈ సంఘం మన సాయం అడగాలా
కళ్ళలో కత్తులు దూసే కసి కలిగిందంటే
గుండెలో భగ్గున రేగే అగ్గి రగులుకుంటే
నెత్తురు మండే ప్రతివాడు సూరీడే అయిపోడా
హేయ్.. ఏ కొంప కొల్లేరు కానీ నాకేమి పట్టిందని
నిద్దర్లో మునిగున్న వాణ్ణి కదిలించడం నీ పని
ఓలెలె ఓలెలె ఓలె.. ఓలెలె ఓలెలె లె...
ఓలెలె ఓలెలె ఓలె.. ఓలెలె ఓలెలె లె...
చావైతే ఈపూట కాకుంటే రేపైన వస్తుంది తప్పించుకోలేవులే
బ్రతుకంటే మన చేతిలో ఉంది
భయమంటు వదిలేస్తే మన మాటవింటుందిలే
ఓలెలె ఓలెలె ఓలె.. ఓలెలె ఓలెలె లె...
ఓలెలె ఓలెలె ఓలె.. ఓలెలె ఓలెలె లె...

pallavi:

olĕlĕ olĕlĕ olĕ.. olĕlĕ olĕlĕ lĕ...
olĕlĕ olĕlĕ olĕ.. olĕlĕ olĕlĕ lĕ...
pārahuṣhāraina pāḍa siḍigesi rammaṁdiroy
pailābachchīsaina āḍa siṁdesi rammaṁdiroy
orori bairāgi ī pŏddu ī joru ābŏddu tanividīrā daruvĕyyuroy
ūrūra ūregi ī ḍappu horĕtti poyeṭṭu ūbĕkki ponīyaroy
hey kaṣhṭālu kannīḽḽagele vastūne vuṁṭāyile
navvaṁṭu toḍuṁṭe sālle emainā sĕyyachchule

saraṇaṁ 1:

maṁdilo kŏṁdaru rābaṁdulai
aṁdiṁdaṁtā kājesi jaihiṁt aṁṭārā
aha ŏhŏ aha ŏhŏho...

maṁdalai paṁdalai pasigaṁdulai
janamaṁtā talalŏṁchesi kharmanuguṁṭārā
badagaḍaṁ baruvaiyyelā tĕga pīḍistuṁṭe
dāruṇaṁ dārulu mūsi veḍāḍudu uṁṭe
prāṇaṁ visigi pille ayinā bĕbbuli ayibodā
hey.. sīmaṁta o sinna sinuge tuphānu avuduṁdile
īnāḍi ī nippu tunage kārsichchu avuduṁdile

saraṇaṁ 2:

sikkagā sīgaḍe kammiṁdani
logaṁ vĕḽḽi sūryuṇṇi rārammani pilavālā
kŏṁḍalā pābame pĕrigiṁdani
kābāḍaṁṭū ī saṁghaṁ mana sāyaṁ aḍagālā
kaḽḽalo kattulu dūse kasi kaligiṁdaṁṭe
guṁḍĕlo bhagguna rege aggi raguluguṁṭe
nĕtturu maṁḍe pradivāḍu sūrīḍe ayiboḍā
hey.. e kŏṁpa kŏlleru kānī nāgemi paṭṭiṁdani
niddarlo munigunna vāṇṇi kadiliṁchaḍaṁ nī pani
olĕlĕ olĕlĕ olĕ.. olĕlĕ olĕlĕ lĕ...
olĕlĕ olĕlĕ olĕ.. olĕlĕ olĕlĕ lĕ...
sāvaide ībūḍa kāguṁṭe rebaina vastuṁdi tappiṁchugolevule
bradugaṁṭe mana sedilo uṁdi
bhayamaṁṭu vadileste mana māḍaviṁṭuṁdile
olĕlĕ olĕlĕ olĕ.. olĕlĕ olĕlĕ lĕ...
olĕlĕ olĕlĕ olĕ.. olĕlĕ olĕlĕ lĕ...