Okkasodane vunnaaru voddigai mee riddarunu

ఒక్కచోటనే వున్నారు వొద్దికై మీ రిద్దరును
Language

(॥పల్లవి॥)
ఒక్కచోటనే వున్నారు వొద్దికై మీ రిద్దరును
అక్కజపు రతి నోలలాడుదురుగాక

(॥ఒక్క॥)
వలపులు దల కెక్కె వావులు కాలు దొక్కె
చెలియరో పతితోడ సిగ్గు లింకేలే
సెలవుల నవ్వు దేరె చెమటలు మేనఁ గారె
పలుమారు జాగులు పచారించ నేఁటికే

(॥ఒక్క॥)
చిగురుఁ గెమ్మోని మాఁగె చిత్తపు టాసలు రేఁగె
బిగియుచు గుట్టుతోడఁ బెనఁగనేలే
మొగమున వసివాడె మోహములు దలకూడె
తగులాయములు లోలో దాఁచ నేఁటికే

(॥ఒక్క॥)
కనుచూపు వాడికాయ కాఁగిలిట్టె వేడికాయ
మొనగోరి చెనకులమోనములేలే
యెనసె శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్ను నేఁడు
చనవరి మొక్కులతో సన్నలు మరేఁటికే

(||pallavi||)
ŏkkasoḍane vunnāru vŏddigai mī riddarunu
akkajabu radi nolalāḍudurugāga

(||ŏkka||)
valabulu dala kĕkkĕ vāvulu kālu dŏkkĕ
sĕliyaro padidoḍa siggu liṁkele
sĕlavula navvu derĕ sĕmaḍalu menam̐ gārĕ
palumāru jāgulu pasāriṁcha nem̐ṭige

(||ŏkka||)
sigurum̐ gĕmmoni mām̐gĕ sittabu ṭāsalu rem̐gĕ
bigiyusu guṭṭudoḍam̐ bĕnam̐ganele
mŏgamuna vasivāḍĕ mohamulu dalagūḍĕ
tagulāyamulu lolo dām̐sa nem̐ṭige

(||ŏkka||)
kanusūbu vāḍigāya kām̐giliṭṭĕ veḍigāya
mŏnagori sĕnagulamonamulele
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnu nem̐ḍu
sanavari mŏkkulado sannalu marem̐ṭige