Okkadigi nurigatte vomtigi daayigatte

ఒక్కటికి నురిగట్టే వొంటికి దాయిగట్టే
Language

(॥పల్లవి॥)
ఒక్కటికి నురిగట్టే వొంటికి దాయిగట్టే-
వెక్కువ గోవాళవిద్య లీడఁ జేయవలెనా

(॥ఒక్క॥)
నిక్కినిక్కి యాకెఁ జూడ నిడివి యాడకు నీడ
అక్కడికే పోరాదా అంతగలితే
మొక్కిమొక్కి నన్నుజూఁచి మూఁగసన్నలేలసేయ
ఇక్కడికే రారాదా యింతగలితేను

(॥ఒక్క॥)
చెప్పిచెప్పి పంపనేల సెలవుల నవ్వనేల
అప్పటి నీ వేఁగరాదా అంతగలితే
తిప్పితిప్పి నాతోనుఁదెగి జాణతనమేల
యిప్పుడే మన్నించరాదా యింత గలితేను

(॥ఒక్క॥)
పూచిఁపూచిఁ మాని నాతో బూమెలు సేసేవుగాక
ఆచాయ నుండవా నీ వంతగలితే
చేచేతఁ గూడితివి శ్రీవేంకటేశ నన్ను
యీ చలమే నీకు దక్కె నింత గలితేను

(||pallavi||)
ŏkkaḍigi nurigaṭṭe vŏṁṭigi dāyigaṭṭe-
vĕkkuva govāḽavidya līḍam̐ jeyavalĕnā

(||ŏkka||)
nikkinikki yāgĕm̐ jūḍa niḍivi yāḍagu nīḍa
akkaḍige porādā aṁtagalide
mŏkkimŏkki nannujūm̐si mūm̐gasannalelaseya
ikkaḍige rārādā yiṁtagalidenu

(||ŏkka||)
sĕppisĕppi paṁpanela sĕlavula navvanela
appaḍi nī vem̐garādā aṁtagalide
tippidippi nādonum̐dĕgi jāṇadanamela
yippuḍe manniṁcharādā yiṁta galidenu

(||ŏkka||)
pūsim̐pūsim̐ māni nādo būmĕlu sesevugāga
āsāya nuṁḍavā nī vaṁtagalide
sesedam̐ gūḍidivi śhrīveṁkaḍeśha nannu
yī salame nīgu dakkĕ niṁta galidenu