ఒక్కటై యప్పటి జోక నుందాము గాక
(॥పల్లవి॥)
ఒక్కటై యప్పటి జోక నుందాము గాక
నిక్కుఁజూపుఁ దలవంపు నీ కేలరా
(॥ఒక్క॥)
కన్నుసన్న నొక్కమాఁట కాయములో నొక్కమాఁట
నిన్నుఁజూచి చూచి యాడ నే నోపరా
వన్నెలకు నోరితీఁటవాదులేల యీచోట
నిన్నటి మొన్నటి లోనే నీ కేలరా
(॥ఒక్క॥)
చేరితేనే వొకచేఁత చేరకుంటే నొకచేఁత
నెరచి నీయెడఁ జేయ నే నేరరా
ఆ రీతి వలపు లీఁత అంత లోనే పై పూఁత
నీరువంకతుంగవలె నీకేలరా
(॥ఒక్క॥)
మోవి మీఁది తేనెలు మోనములో కేనములు
నీవద్దఁ బచరించ నే నేరరా
శ్రీవేంకటేశ్వరుఁడ చేకొని కూడితి నన్ను
నేవళపుఁ జిఱునవ్వు నీకేలరా
(||pallavi||)
ŏkkaḍai yappaḍi joga nuṁdāmu gāga
nikkum̐jūbum̐ dalavaṁpu nī kelarā
(||ŏkka||)
kannusanna nŏkkamām̐ṭa kāyamulo nŏkkamām̐ṭa
ninnum̐jūsi sūsi yāḍa ne nobarā
vannĕlagu noridīm̐ṭavādulela yīsoḍa
ninnaḍi mŏnnaḍi lone nī kelarā
(||ŏkka||)
seridene vŏgasem̐ta seraguṁṭe nŏgasem̐ta
nĕrasi nīyĕḍam̐ jeya ne nerarā
ā rīdi valabu līm̐ta aṁta lone pai pūm̐ta
nīruvaṁkaduṁgavalĕ nīgelarā
(||ŏkka||)
movi mīm̐di tenĕlu monamulo kenamulu
nīvaddam̐ basariṁcha ne nerarā
śhrīveṁkaḍeśhvarum̐ḍa segŏni kūḍidi nannu
nevaḽabum̐ jiṟunavvu nīgelarā