(॥పల్లవి॥)
ఒక్కట మీరిద్దరు నహోబలేశ
వుక్కళమై కాచుకొం డహోబలేశ
(॥ఒక్క॥)
మారుకొండ లెక్కి వచ్చి మంకువాపె లకిమమ్మ
వూరె నీసెలవినవ్వహోబలేశ
తేరి చూచి నీమారు దేవతలఁ గరుణించె
వూరటాయ నీకాపె యహోబలేశ
(॥ఒక్క॥)
గొబ్బున నీతొడ యెక్కి కొసవెండ్రుకలు దువ్వి
వుబ్బించీ నిన్నిపుడే యహోబలేశ
నిబ్బరపుఁజేతులను నిన్నుఁ గాఁగిలించి పట్టి
వొబ్బిడిఁ దా మెరసె నహోబలేశ
(॥ఒక్క॥)
మొల్లమినవ్వులతోడ మోవితేనె విందువెట్టి
వుల్లమెల్లఁ గరఁచె నహోబలేశ
యిల్లిదె శ్రీవేంకటాద్రి విరవై తనచన్నుల-
వొల్లనె నాఁటించీ ని న్నహోబలేశ
(||pallavi||)
ŏkkaḍa mīriddaru nahobaleśha
vukkaḽamai kāsugŏṁ ḍahobaleśha
(||ŏkka||)
mārugŏṁḍa lĕkki vachchi maṁkuvābĕ lagimamma
vūrĕ nīsĕlavinavvahobaleśha
teri sūsi nīmāru devadalam̐ garuṇiṁchĕ
vūraḍāya nīgābĕ yahobaleśha
(||ŏkka||)
gŏbbuna nīdŏḍa yĕkki kŏsavĕṁḍrugalu duvvi
vubbiṁchī ninnibuḍe yahobaleśha
nibbarabum̐jedulanu ninnum̐ gām̐giliṁchi paṭṭi
vŏbbiḍim̐ dā mĕrasĕ nahobaleśha
(||ŏkka||)
mŏllaminavvuladoḍa movidenĕ viṁduvĕṭṭi
vullamĕllam̐ garam̐sĕ nahobaleśha
yillidĕ śhrīveṁkaḍādri viravai tanasannula-
vŏllanĕ nām̐ṭiṁchī ni nnahobaleśha