ఒక్క మొగనాండ్లకు వొరటు లెందాఁకానే
(॥పల్లవి॥)
ఒక్క మొగనాండ్లకు వొరటు లెందాఁకానే
వెక్కసపుఁ బొత్తు గూడి వేడుకతో నుందమే
(॥ఒక్క॥)
అప్పుడు నేనన్నమాట లన్నియు నోరుచుకోవే
చెప్పినప్రియములు చేకొనవే
యెప్పుడూ నక్కచెల్లెండ్ల మేఁటికే మనలో వాదు
కప్పినపందులతోడ కాఁపురాలు సేతమే
(॥ఒక్క॥)
మనలో నిఁక సవిమచ్చరాలు మానుదమే
వొనర బాసలు సేసుకుండుదమే
సనుపుఁజుట్టాలమూ నవ్వుతాఁ జెలఁగుదమే
మనసు లొక్కటిగాఁగ మచ్చికలు సేతమే
(॥ఒక్క॥)
యెగ్గులునుఁ దప్పులును యెన్నఁడు నెంచవలదే
వొగ్గి వరుసవంతులనొద్దికౌదమే
సిగ్గుదేర నిన్నూ నన్నూ శ్రీవేంకటేశుఁడు గూడె
తగ్గనియానందాన తనివి నొందుదమే
(||pallavi||)
ŏkka mŏganāṁḍlagu vŏraḍu lĕṁdām̐kāne
vĕkkasabum̐ bŏttu gūḍi veḍugado nuṁdame
(||ŏkka||)
appuḍu nenannamāḍa lanniyu norusugove
sĕppinapriyamulu segŏnave
yĕppuḍū nakkasĕllĕṁḍla mem̐ṭige manalo vādu
kappinabaṁduladoḍa kām̐purālu sedame
(||ŏkka||)
manalo nim̐ka savimachcharālu mānudame
vŏnara bāsalu sesuguṁḍudame
sanubum̐juṭṭālamū navvudām̐ jĕlam̐gudame
manasu lŏkkaḍigām̐ga machchigalu sedame
(||ŏkka||)
yĕggulunum̐ dappulunu yĕnnam̐ḍu nĕṁchavalade
vŏggi varusavaṁtulanŏddigaudame
siggudera ninnū nannū śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
tagganiyānaṁdāna tanivi nŏṁdudame