Okka manasaaya nimka numdavayyaa

ఒక్క మనసాయ నిఁక నుండవయ్యా
Language

(॥పల్లవి॥)
ఒక్క మనసాయ నిఁక నుండవయ్యా
మిక్కుటపు నీ చేఁతలు మెచ్చితినయ్యా

(॥ఒక్క॥)
తగవులఁ బెట్టి పెట్టి తగిలి పెండ్లాడితివి
నగి నగి కొనగోరు నాఁటించితివి
మొగము చూపి చూపి ముట్ట వలపించితివి
అగడు సే సింకా నెంత ఆసలఁబెట్టేవయ్యా

(॥ఒక్క॥)
సరసము లాడి యాడి చవులెల్లా రేఁచితివి
పొరుగున నుండి వుండి పొందుకొంటివి
తెరవేసి తేరవేసి తేనెమోవి యానితిని
తరితీపు లప్పటి నెందాఁకాఁ జేసేనయ్యా

(॥ఒక్క॥)
మళ్లి మళ్లి చూచి చూచి మరిగించుకొంటివి
తెల్లమిగాఁ గూడి కూడా తేలించితివి
యెల్లగా శ్రీవేంకటేశ యిన్నింటా నన్నేలితివి
పల్లదాన మరియేమి బాఁతిపడేవయ్యా

(||pallavi||)
ŏkka manasāya nim̐ka nuṁḍavayyā
mikkuḍabu nī sem̐talu mĕchchidinayyā

(||ŏkka||)
tagavulam̐ bĕṭṭi pĕṭṭi tagili pĕṁḍlāḍidivi
nagi nagi kŏnagoru nām̐ṭiṁchidivi
mŏgamu sūbi sūbi muṭṭa valabiṁchidivi
agaḍu se siṁkā nĕṁta āsalam̐bĕṭṭevayyā

(||ŏkka||)
sarasamu lāḍi yāḍi savulĕllā rem̐sidivi
pŏruguna nuṁḍi vuṁḍi pŏṁdugŏṁṭivi
tĕravesi teravesi tenĕmovi yānidini
taridību lappaḍi nĕṁdām̐kām̐ jesenayyā

(||ŏkka||)
maḽli maḽli sūsi sūsi marigiṁchugŏṁṭivi
tĕllamigām̐ gūḍi kūḍā teliṁchidivi
yĕllagā śhrīveṁkaḍeśha yinniṁṭā nannelidivi
palladāna mariyemi bām̐tibaḍevayyā