Ohoho maamayyaa idemayyaa

ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా
Work
Year
Language

పల్లవి:

ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా
ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా
ఇంటిని విడిచి షికారు కొడితే ఎంతో హాయి కలదయ్యా

ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ, బలెబలె బతికిన కాలేజి
ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ, బలెబలె బతికిన కాలేజి
మాటలు రాని మృగాలు కొన్ని మనిషి కి పాఠం చెబుతాయి

చరణం 1:

పులులూ చిరుతలు సింహాలన్నీ వెలుపల తిరిగిన ప్రమాదమే.. ఓ మావయ్యా మావయ్యా

కొందరు ఘరాన మనుషులకన్నా క్రూరము కావీ జంతువులు..
ఓ అమ్మాయీ.. అమ్మాయీ

శౌర్యం పెరిగిన మనిషిని మృగాన్ని కటకటాలలో పెడతారు
ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా

చరణం 2:

గుర్రపు అంశం గాడిద వంశం చారల చారల జీబ్రావి
చుక్కల జిరాఫి ఒంటెకు బంధువు.. మనిషికి బంధువు చింపాంజిపంజి
మనిషి చేష్టలు కోతులకుంటే .. కోతి చేష్టలు కొందరివి..

వా...ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ, బలెబలె బతికిన కాలేజి

చరణం 3:

తీరున తిరిగే నోరును తెరిచే ఏనుగు లాంటిది ఏమిటది..
ఓ మావయ్యా.. మావయ్యా
ఏనుగు వంటిది నీటిగుర్రము.. దానికి తమ్ముడు ఖడ్గమృగం
అధికులు పేదల కాల్చుకు తింటే.. ఇవి ఆకూఅలమే తింటాయి
ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా

రాజులు ఎక్కే అంబారీపై అందరు ఎక్కుట తప్పు కదా
రోజులు మారాయ్ž రాజులు పోయి ప్రజలే ప్రభువులు ఈనాడు..
అహ.. ప్రజలే ప్రభువులు ఈనాడు
మనుషుల పైన సవారికన్నా ఏనుగు సవారి నయం కదా
ఆ నిజం నిజం .. అహ మజా మజా

ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా
.ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ... బలెబలె బతికిన కాలేజి

pallavi:

ohŏhŏ māmayyā idemayyā.. balĕbalĕ bāgā uṁdayyā
ohŏhŏ māmayyā idemayyā.. balĕbalĕ bāgā uṁdayyā
iṁṭini viḍisi ṣhigāru kŏḍide ĕṁto hāyi kaladayyā

ohŏhŏ ammāyī idi kālejī, balĕbalĕ badigina kāleji
ohŏhŏ ammāyī idi kālejī, balĕbalĕ badigina kāleji
māḍalu rāni mṛgālu kŏnni maniṣhi ki pāṭhaṁ sĕbudāyi

saraṇaṁ 1:

pululū sirudalu siṁhālannī vĕlubala tirigina pramādame.. o māvayyā māvayyā

kŏṁdaru gharāna manuṣhulagannā krūramu kāvī jaṁtuvulu..
o ammāyī.. ammāyī

śhauryaṁ pĕrigina maniṣhini mṛgānni kaḍagaḍālalo pĕḍadāru
ohŏhŏ māmayyā idemayyā.. balĕbalĕ bāgā uṁdayyā

saraṇaṁ 2:

gurrabu aṁśhaṁ gāḍida vaṁśhaṁ sārala sārala jībrāvi
sukkala jirāphi ŏṁṭĕgu baṁdhuvu.. maniṣhigi baṁdhuvu siṁpāṁjibaṁji
maniṣhi seṣhṭalu kodulaguṁṭe .. kodi seṣhṭalu kŏṁdarivi..

vā...ohŏhŏ ammāyī idi kālejī, balĕbalĕ badigina kāleji

saraṇaṁ 3:

tīruna tirige norunu tĕrise enugu lāṁṭidi emiḍadi..
o māvayyā.. māvayyā
enugu vaṁṭidi nīḍigurramu.. dānigi tammuḍu khaḍgamṛgaṁ
adhigulu pedala kālsugu tiṁṭe.. ivi āgūalame tiṁṭāyi
ohŏhŏ māmayyā idemayyā.. balĕbalĕ bāgā uṁdayyā

rājulu ĕkke aṁbārībai aṁdaru ĕkkuḍa tappu kadā
rojulu mārāyž rājulu poyi prajale prabhuvulu īnāḍu..
aha.. prajale prabhuvulu īnāḍu
manuṣhula paina savārigannā enugu savāri nayaṁ kadā
ā nijaṁ nijaṁ .. aha majā majā

ohŏhŏ māmayyā idemayyā.. balĕbalĕ bāgā uṁdayyā
.ohŏhŏ ammāyī idi kālejī... balĕbalĕ badigina kāleji