పల్లవి:
(ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
చిందులెయ్యి మావా కనువిందు సెయ్యి మావా) ||2||
ఓహోహో.. ఓహోహో.. ఆహాహా.. ఆహాహా..
సుక్కలన్ని సోకులు మీరే సందమామ పక్కకు చేరే ||2||
చక్కనైన వేళా..ఆ..ఆ
ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
చిందులెయ్యి మావా కనువిందు సెయ్యి మావా
చరణం 1:
(సిటికంత లేత నడుము ఊగిపోతుంటే
సిరిమువ్వలు ఘల్లుమంటూ రేగిపోతుంటే) ||2||
చల్లగాలి శ్రుతిగా చక్కని పిల్లగాలి జతగా ||2||
అల్లన మెల్లన గుండెలు ఝల్లన ఆడవోయి మామా
చరణం 2:
(ఆకాశం ఆరుబైట పందిరేసింది
భూదేవి జారుపైట తెరగా చేసింది) ||2||
కన్నెపిల్ల ఇదిగో వెన్నెల గోరుముద్దలవిగో ||2||
చల్లగ మెల్లగ సరసాలాడుతూ ఆరగించు మావా
pallavi:
(oho taddhimi tagajhaṇu labjari kiḍadaga
taḽāṁgu dhimidaga tāḽaṁ vadalaga
siṁdulĕyyi māvā kanuviṁdu sĕyyi māvā) ||2||
ohoho.. ohoho.. āhāhā.. āhāhā..
sukkalanni sogulu mīre saṁdamāma pakkagu sere ||2||
sakkanaina veḽā..ā..ā
oho taddhimi tagajhaṇu labjari kiḍadaga
taḽāṁgu dhimidaga tāḽaṁ vadalaga
siṁdulĕyyi māvā kanuviṁdu sĕyyi māvā
saraṇaṁ 1:
(siḍigaṁta leda naḍumu ūgiboduṁṭe
sirimuvvalu ghallumaṁṭū regiboduṁṭe) ||2||
sallagāli śhrudigā sakkani pillagāli jadagā ||2||
allana mĕllana guṁḍĕlu jhallana āḍavoyi māmā
saraṇaṁ 2:
(āgāśhaṁ ārubaiḍa paṁdiresiṁdi
bhūdevi jārubaiḍa tĕragā sesiṁdi) ||2||
kannĕbilla idigo vĕnnĕla gorumuddalavigo ||2||
sallaga mĕllaga sarasālāḍudū āragiṁchu māvā