ఒకరు చేసినభాగ్య మొకరికి నేల వచ్చు
(॥పల్లవి॥)
ఒకరు చేసినభాగ్య మొకరికి నేల వచ్చు
మొకము చూచినప్పడే మొక్కీని తాను
(॥ఒక॥)
సొలసి సొలసి నీతో సుదతి మాటాడఁగాను
పొలసి తానేమి వినీ పొంచులు యీకె
కలువరేకులవంటికన్నుల నాపె చూడఁగా
నిలుచున్నది యెదుట నెరవాదై తాను
(॥ఒక॥)
ననుపున నాపె నీతో నవ్వులెల్లా నవ్వంగాను
పనివడి తానేమి పైకొనీ నీకె
చనవునఁ దనమోవిచవు లాపె చూపఁగాను
నునుపునఁ దానేమి నోరూరీ నీపె
(॥ఒక॥)
చెక్కు నొక్కి నేం డాపె సేవలెల్లాఁ. జేయఁగాను
కక్కసించి యేల యీపె కాఁగిలించీని
మక్కువ శ్రీవేంకటేశ మరి నన్ను నేలితివి
తక్కక యింకానేమి తడవీఁ దాను
(||pallavi||)
ŏgaru sesinabhāgya mŏgarigi nela vachchu
mŏgamu sūsinappaḍe mŏkkīni tānu
(||ŏga||)
sŏlasi sŏlasi nīdo sudadi māḍāḍam̐gānu
pŏlasi tānemi vinī pŏṁchulu yīgĕ
kaluvaregulavaṁṭigannula nābĕ sūḍam̐gā
nilusunnadi yĕduḍa nĕravādai tānu
(||ŏga||)
nanubuna nābĕ nīdo navvulĕllā navvaṁgānu
panivaḍi tānemi paigŏnī nīgĕ
sanavunam̐ danamovisavu lābĕ sūbam̐gānu
nunubunam̐ dānemi norūrī nībĕ
(||ŏga||)
sĕkku nŏkki neṁ ḍābĕ sevalĕllām̐. jeyam̐gānu
kakkasiṁchi yela yībĕ kām̐giliṁchīni
makkuva śhrīveṁkaḍeśha mari nannu nelidivi
takkaga yiṁkānemi taḍavīm̐ dānu