Ogaribai nebamu verogaribaim joobevu

ఒకరిపై నెపము వేరొకరిపైఁ జూపేవు
Language

(॥పల్లవి॥)
ఒకరిపై నెపము వేరొకరిపైఁ జూపేవు
యెకసక్కేలకు నాపె నేమీననఁజాలకే

(॥ఒక॥)
పక్కనఁ గాంత చన్నులు పయ్యదలో దాఁచుకోఁగా
జక్కవపిట్టలనేలసాదించేవయ్యా
మక్కువ నాపె సిగ్గుతో మాటలాడకుండితేను
ఇక్కడ గూఁటిచిలుక నేల దిట్టేవయ్యా

(॥ఒక॥)
ఇట్టినీచేఁతలు చూచి ఇంతి మోము వంచితేను
చుట్టుక యద్దమునేల సొలసేవయ్యా
వుట్టిపడ నాపె నిన్ను వుదుటునఁ జూచితేను
పట్టి చకోరాలతోడ పంతమేలాడేవయ్యా

(॥ఒక॥)
నిండుఁగొప్పు వెట్టుకొని నెలఁత నిక్కీనంటాను
గండుఁదుమ్మిదలఁ జెనకఁగ నేలయ్యా
అండనే శ్రీవేంకటేశ అలమేల్ మంగపతివి
దండిగవఁగూడి యాపెచక్కఁదనము మెచ్చేవయ్యా

(||pallavi||)
ŏgaribai nĕbamu verŏgaribaim̐ jūbevu
yĕgasakkelagu nābĕ nemīnanam̐jālage

(||ŏga||)
pakkanam̐ gāṁta sannulu payyadalo dām̐sugom̐gā
jakkavabiṭṭalanelasādiṁchevayyā
makkuva nābĕ siggudo māḍalāḍaguṁḍidenu
ikkaḍa gūm̐ṭisiluga nela diṭṭevayyā

(||ŏga||)
iṭṭinīsem̐talu sūsi iṁti momu vaṁchidenu
suṭṭuga yaddamunela sŏlasevayyā
vuṭṭibaḍa nābĕ ninnu vuduḍunam̐ jūsidenu
paṭṭi sagorāladoḍa paṁtamelāḍevayyā

(||ŏga||)
niṁḍum̐gŏppu vĕṭṭugŏni nĕlam̐ta nikkīnaṁṭānu
gaṁḍum̐dummidalam̐ jĕnagam̐ga nelayyā
aṁḍane śhrīveṁkaḍeśha alamel maṁgabadivi
daṁḍigavam̐gūḍi yābĕsakkam̐danamu mĕchchevayyā