Ogadogadi gooda doyamma neeyamde

ఒకటొకటి గూడ దోయమ్మ నీయందే
Language

(॥పల్లవి॥)
ఒకటొకటి గూడ దోయమ్మ నీయందే
సకలము నెటువలె సంతము సేసితివే

(॥ఒక॥)
తానకపునీకుచాలు దంతికుంభాలఁ బోలితే
యీనడుము సింహమునేల పోలనే
అనిపట్టి నీకన్ను లంబుజాలఁ బోలితేను
ఆననము చందురుని నదియేల పోలెనే

(॥ఒక॥)
అతివ నీచేతులు బిసాంగములఁ బోలితేను
యితవై నడపు హంసనేల పోలెనే
చతురత నాసికము సంపెంగఁ బోలితేను
తతి నీకురులు తుమ్మిదలనేల పోలెనే

(॥ఒక॥)
నేవళపునీయారు నీలాహిఁ బోలితేను
యీవల మేను మెఱుపునేల పోలెనే
శ్రీవేంకటేశుమోవి చిన్నికెంపు లంటించి
ఆవేళ దంతాలు వజ్రాలై యెట్టు వోలెనే

(||pallavi||)
ŏgaḍŏgaḍi gūḍa doyamma nīyaṁde
sagalamu nĕḍuvalĕ saṁtamu sesidive

(||ŏga||)
tānagabunīgusālu daṁtiguṁbhālam̐ bolide
yīnaḍumu siṁhamunela polane
anibaṭṭi nīgannu laṁbujālam̐ bolidenu
ānanamu saṁduruni nadiyela polĕne

(||ŏga||)
adiva nīsedulu bisāṁgamulam̐ bolidenu
yidavai naḍabu haṁsanela polĕne
sadurada nāsigamu saṁpĕṁgam̐ bolidenu
tadi nīgurulu tummidalanela polĕne

(||ŏga||)
nevaḽabunīyāru nīlāhim̐ bolidenu
yīvala menu mĕṟubunela polĕne
śhrīveṁkaḍeśhumovi sinnigĕṁpu laṁṭiṁchi
āveḽa daṁtālu vajrālai yĕṭṭu volĕne