(॥పల్లవి॥)
ఒకటి కొకటికిని వొడగాయ
సకలంబునకును సమరసమాయ
(॥ఒక॥)
కలికినెమ్మోము కళల మెరుగులకు
లలిఁ దురుము మొగులు లావాయ
తొలి తొలి వలపుల తొలుకరికాలము
వలనుగ నిదిగో వచ్చెను నేఁడు
(॥ఒక॥)
రమణి కంకణపురవళి వురుములకు
చెమటల సోనలు చెలరేఁగె
తమకపు టాసల తగువెదకాలము
తమలపు ముదమునఁ దలకొనె నేఁడు
(॥ఒక॥)
పడఁతి బొమల సురపతి చాపములకు
సడులని ప్రియముల జడి వట్టె
బడి శ్రీవేంకటపతిరతికాలము
తొడరి యింతట నెదురుకొనె నేఁడు
(||pallavi||)
ŏgaḍi kŏgaḍigini vŏḍagāya
sagalaṁbunagunu samarasamāya
(||ŏga||)
kaliginĕmmomu kaḽala mĕrugulagu
lalim̐ durumu mŏgulu lāvāya
tŏli tŏli valabula tŏlugarigālamu
valanuga nidigo vachchĕnu nem̐ḍu
(||ŏga||)
ramaṇi kaṁkaṇaburavaḽi vurumulagu
sĕmaḍala sonalu sĕlarem̐gĕ
tamagabu ṭāsala taguvĕdagālamu
tamalabu mudamunam̐ dalagŏnĕ nem̐ḍu
(||ŏga||)
paḍam̐ti bŏmala surabadi sābamulagu
saḍulani priyamula jaḍi vaṭṭĕ
baḍi śhrīveṁkaḍabadiradigālamu
tŏḍari yiṁtaḍa nĕdurugŏnĕ nem̐ḍu