ఒకటి కినుమడయ్యీ నుప్పు చింది
(॥పల్లవి॥)
ఒకటి కినుమడయ్యీ నుప్పు చింది
మొకము చూచీ నట్టె ముచ్చటాడనీవే
(॥ఒక॥)
చలివాసివున్నదాన సముకాస నున్న దాన
నలువంక నింకఁ గొంతనవ్వీనీవే
తలఁపులోనిదాన తగులాయమైనదాన
ములువాఁడికొనగోరు మోపనీవే
(॥ఒక॥)
సేసకు లోనైనదాన సేవసేయుచున్నదాన
పోసరించి యింకఁ గొంత బోదించనీవే
రాసికెక్కినట్టిదాన రతి కియ్యకొన్నదాన
మోసపోనివలపుల ముంచనీవే
(॥ఒక॥)
కందువనే వున్న దాన కాఁగిలించుకన్నదాన
యిందమని మోవి నాకునియ్యనీవే
యిందరిలో శ్రీవేంకటేశ్వరుఁడు నిన్ను గూడె
మందలించి యింకానింకా మన్నించనీవే
(||pallavi||)
ŏgaḍi kinumaḍayyī nuppu siṁdi
mŏgamu sūsī naṭṭĕ muchchaḍāḍanīve
(||ŏga||)
salivāsivunnadāna samugāsa nunna dāna
naluvaṁka niṁkam̐ gŏṁtanavvīnīve
talam̐pulonidāna tagulāyamainadāna
muluvām̐ḍigŏnagoru mobanīve
(||ŏga||)
sesagu lonainadāna sevaseyusunnadāna
posariṁchi yiṁkam̐ gŏṁta bodiṁchanīve
rāsigĕkkinaṭṭidāna radi kiyyagŏnnadāna
mosabonivalabula muṁchanīve
(||ŏga||)
kaṁduvane vunna dāna kām̐giliṁchugannadāna
yiṁdamani movi nāguniyyanīve
yiṁdarilo śhrīveṁkaḍeśhvarum̐ḍu ninnu gūḍĕ
maṁdaliṁchi yiṁkāniṁkā manniṁchanīve