Ogadi kinumadaaya nuvida simgaaraalu

ఒకటి కినుమడాయ నువిద సింగారాలు
Language

(॥పల్లవి॥)
ఒకటి కినుమడాయ నువిద సింగారాలు
సకలముఁ జిత్తగించు జాణఁడవు నీవు

(॥ఒక॥)
నిలువు దురు మొక్కటే నిండుఁజీఁకటిగాని
నెలఁత నవ్వులైతే వెన్నెల కుప్పలు
పలుచనికెమ్మోవి పచ్చిచిగురింతేకాని
అలరన దంతములైతే వజ్రములే

(॥ఒక॥)
పట్టరాని నెన్నడుమే భావించసన్నముగాని
గట్టిచన్నలైతేను కడుగొప్పలు
అట్టె మెఱుఁగుఁదొడ లాఁదోఁకలై వుండెగాని
మిట్టలై నపిఱుఁదులు మిక్కిలి బటవులే

(॥ఒక॥)
యించుకంతలు పాదాలే యెఱ్ఱని వన్నేయఁగాని
యెంచిచూడ మేనెల్లా హేమవర్ణమే
కొంచక శ్రీవేంకటేశ కూడితి వీకెను నేఁడు
మించిన యాపెవలపు మేలుమీఁది మేలు

(||pallavi||)
ŏgaḍi kinumaḍāya nuvida siṁgārālu
sagalamum̐ jittagiṁchu jāṇam̐ḍavu nīvu

(||ŏga||)
niluvu duru mŏkkaḍe niṁḍum̐jīm̐kaḍigāni
nĕlam̐ta navvulaide vĕnnĕla kuppalu
palusanigĕmmovi pachchisiguriṁtegāni
alarana daṁtamulaide vajramule

(||ŏga||)
paṭṭarāni nĕnnaḍume bhāviṁchasannamugāni
gaṭṭisannalaidenu kaḍugŏppalu
aṭṭĕ mĕṟum̐gum̐dŏḍa lām̐dom̐kalai vuṁḍĕgāni
miṭṭalai nabiṟum̐dulu mikkili baḍavule

(||ŏga||)
yiṁchugaṁtalu pādāle yĕṭrani vanneyam̐gāni
yĕṁchisūḍa menĕllā hemavarṇame
kŏṁchaga śhrīveṁkaḍeśha kūḍidi vīgĕnu nem̐ḍu
miṁchina yābĕvalabu melumīm̐di melu