ఒకటి కినుమడాయ నొద్దిక నీ వలపులు
(॥పల్లవి॥)
ఒకటి కినుమడాయ నొద్దిక నీ వలపులు
మొకమిచ్చల నా పొందు ముమ్మడించె నిపుడు
(॥॥)
వీడెమిచ్చినాపె నీపై వేడుకలు సేయఁ గాన
వాడవారిపైఁ జల్లేవు వసంతము
వోడఁ గట్టినదూలమై వొకతె నీకుండఁ గాను
ఆడనే వేరేకతెకు నంటుబచ్చలైతివి
(॥॥)
పాదాలొత్తే యాపె నిన్నుఁ బలుకులఁ గొసరఁగ
వీదివారితో నాడేవు వెడమాటలు
తోదోపుల వేరొకతె తోడునీడై వుండఁ గాను
సోదించి వేరొకతెకు సూదిరాయి వైతివి
(॥॥)
కాఁగిలించుకొన్న యాపె కందువలఁ గరఁగఁగా
లోఁగిటి లోనియాపెకు లోనైతివి
చేఁగదేరొకతె నీకు జిగురుఁ గండై వుండఁ గా
పాఁగి శ్రీవేంకటేశ నాపాలిభాగ్యమైతివి
(||pallavi||)
ŏgaḍi kinumaḍāya nŏddiga nī valabulu
mŏgamichchala nā pŏṁdu mummaḍiṁchĕ nibuḍu
(||||)
vīḍĕmichchinābĕ nībai veḍugalu seyam̐ gāna
vāḍavāribaim̐ jallevu vasaṁtamu
voḍam̐ gaṭṭinadūlamai vŏgadĕ nīguṁḍam̐ gānu
āḍane veregadĕgu naṁṭubachchalaidivi
(||||)
pādālŏtte yābĕ ninnum̐ balugulam̐ gŏsaram̐ga
vīdivārido nāḍevu vĕḍamāḍalu
todobula verŏgadĕ toḍunīḍai vuṁḍam̐ gānu
sodiṁchi verŏgadĕgu sūdirāyi vaidivi
(||||)
kām̐giliṁchugŏnna yābĕ kaṁduvalam̐ garam̐gam̐gā
lom̐giḍi loniyābĕgu lonaidivi
sem̐gaderŏgadĕ nīgu jigurum̐ gaṁḍai vuṁḍam̐ gā
pām̐gi śhrīveṁkaḍeśha nābālibhāgyamaidivi