Ogadi goodinanu verogadigim bosamgadu

ఒకటి గూడినను వేరొకటికిఁ బొసఁగదు
Language

(॥పల్లవి॥)
ఒకటి గూడినను వేరొకటికిఁ బొసఁగదు
వికటాలై నీవలన వేదనలే చెలికి

(॥ఒక॥)
కమలాక్షిగనక యీకన్నీటికొలను దగు
తమకపుమేనికాఁక తగదు గాని
తమిఁ గీరవాణిగాన తగుఁ బొదలుమాఁటలు
అమరౌ చెదరినయట్టి నెరిపురులు

(॥ఒక॥)
జక్కనకుచగనక సరిఁ దాపరవి మేలు
నిక్కి వెల్లనిమేనివెన్నెలఁ గూడదు
అక్కటా చిగురుఁబోడి కగుఁ జెమటలమంచు
గక్కన నిట్టూర్పు పెనుగాలి గాదుగాని

(॥ఒక॥)
మదగజయానగాన మఱపుమదము దగు
అదనఁ గిందుపడేదే యది చెల్లదు
యెదుట శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివి
కదియ కింతయేఁచినకపటమే నేరమి

(||pallavi||)
ŏgaḍi gūḍinanu verŏgaḍigim̐ bŏsam̐gadu
vigaḍālai nīvalana vedanale sĕligi

(||ŏga||)
kamalākṣhiganaga yīgannīḍigŏlanu dagu
tamagabumenigām̐ka tagadu gāni
tamim̐ gīravāṇigāna tagum̐ bŏdalumām̐ṭalu
amarau sĕdarinayaṭṭi nĕriburulu

(||ŏga||)
jakkanagusaganaga sarim̐ dābaravi melu
nikki vĕllanimenivĕnnĕlam̐ gūḍadu
akkaḍā sigurum̐boḍi kagum̐ jĕmaḍalamaṁchu
gakkana niṭṭūrbu pĕnugāli gādugāni

(||ŏga||)
madagajayānagāna maṟabumadamu dagu
adanam̐ giṁdubaḍede yadi sĕlladu
yĕduḍa śhrīveṁkaḍeśha yiṁti niṭṭĕ kūḍidivi
kadiya kiṁtayem̐sinagabaḍame nerami