Oga vanida nava mudida suma lalida rasa bharida...

ఒక వనిత నవ ముదిత సుమ లలిత రస భరిత...
Year
Language

పల్లవి:

హాఁ..ఆ..ఓ.. అజంతా వెలవెలబోదా... ఎల్లోరా తల్లడిల్లదా
కాశ్మీరం కలవర పడదా... తాజ్మహల్ తడబడి పోదా
ఆ..ఆ..ఆ.. హాయ్ హాయ్.. ఆ..ఆ..ఆ..
ఒక వనిత... నవ ముదిత... సుమ లలిత... రస భరిత
ఒక వనిత... నవ ముదిత... సుమ లలిత... రస భరిత
అలిగితే ఏమవుతుంది... అందం నాగు పామౌతుంది
గోరింకా... హహహ... ఓ గోరింకా... హేయ్...
గోరింకా... హా... ఓ గోరింకా... హా..హా..హా..హా..

చరణం 1:

ఆ... కొసవేళ్ళ సవరణ నోచుకున్నా... కురులదేమి భాగ్యమో
ఆ... అడుగుల నునుపు ముద్దాడుకున్నా... గడపదెంత సౌభాగ్యమో... ఆ..ఆ..
అది కంటి మెరుపో... ఆ బ్రహ్మ గెలుపో
అది కంటి మెరుపో... ఆ బ్రహ్మ గెలుపో
కాకా... కాకా... కాకా...
లల్లలా... లల్లలా... లల్లలా... లర లా...

అలిగితే ఏమౌతుంది ఉదయమే నడిజామౌతుంది
గోరింకా... ఓ గోరింకా... హోయ్... ఊఁహహ...
గోరింకా... హా... ఓ గోరింకా... హా..హా..హా..హా..

చరణం 2:

ఆ... అలివేణి మోమును చూసిన... అద్దానిదెంతటి పుణ్యమో
ఆ... చెలి నుదుటను ముద్దుగ దిద్దిన.. తిలకానిదెంతటి లావణ్యమో...ఆ...ఆ...
ఆ రంభ రూపం... అపరంజి శిల్పం...హ హ
ఆ రంభ రూపం... అపరంజి శిల్పం...హ హ
ఆ చంద్ర వదన... ఆ కుందరదన... ఆ కమల నయన... ఆ కాంతి సదన
నవ్వితే ఏమౌతుంది... నవ్వే నవ్వుకు నవ్వౌతుంది

గోరింకా... హే గోరింకా...హ..హ..హ..
గోరింకా...
హా చాలింకా...హ..హ..హ..

pallavi:

hām̐..ā..o.. ajaṁtā vĕlavĕlabodā... ĕllorā tallaḍilladā
kāśhmīraṁ kalavara paḍadā... tājmahal taḍabaḍi podā
ā..ā..ā.. hāy hāy.. ā..ā..ā..
ŏga vanida... nava mudida... suma lalida... rasa bharida
ŏga vanida... nava mudida... suma lalida... rasa bharida
aligide emavuduṁdi... aṁdaṁ nāgu pāmauduṁdi
goriṁkā... hahaha... o goriṁkā... hey...
goriṁkā... hā... o goriṁkā... hā..hā..hā..hā..

saraṇaṁ 1:

ā... kŏsaveḽḽa savaraṇa nosugunnā... kurulademi bhāgyamo
ā... aḍugula nunubu muddāḍugunnā... gaḍabadĕṁta saubhāgyamo... ā..ā..
adi kaṁṭi mĕrubo... ā brahma gĕlubo
adi kaṁṭi mĕrubo... ā brahma gĕlubo
kāgā... kāgā... kāgā...
lallalā... lallalā... lallalā... lara lā...

aligide emauduṁdi udayame naḍijāmauduṁdi
goriṁkā... o goriṁkā... hoy... ūm̐haha...
goriṁkā... hā... o goriṁkā... hā..hā..hā..hā..

saraṇaṁ 2:

ā... aliveṇi momunu sūsina... addānidĕṁtaḍi puṇyamo
ā... sĕli nuduḍanu mudduga diddina.. tilagānidĕṁtaḍi lāvaṇyamo...ā...ā...
ā raṁbha rūbaṁ... abaraṁji śhilbaṁ...ha ha
ā raṁbha rūbaṁ... abaraṁji śhilbaṁ...ha ha
ā saṁdra vadana... ā kuṁdaradana... ā kamala nayana... ā kāṁti sadana
navvide emauduṁdi... navve navvugu navvauduṁdi

goriṁkā... he goriṁkā...ha..ha..ha..
goriṁkā...
hā sāliṁkā...ha..ha..ha..