Oga devada velisimdi nee kosame

ఒక దేవత వెలిసింది నీ కోసమే
Year
Language

పల్లవి:

ఒక దేవత వెలసింది నీ కోసమే.. ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
ఒక దేవత వెలసింది నా కోసమే.. ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
సంధ్యా కాంతుల్లోన శ్రావణిలా.. సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా.. శ్రీరస్తంటూ నీతో అంది ఇలా ... నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నీ కోసమే.. ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

చరణం 1:

విరిసే వెన్నెల్లోన మెరిసే కన్నుల్లోనా నీ నీడే చూసాడమ్మ
ఎనిమిది దిక్కుల్లోనా నింగిలి చుక్కల్లోనా నీ జాడే వెదికాడమ్మ
నీ నవ్వే తన మదిలో అమృతవర్షం... నీలోనే వుందమ్మ అందని స్వర్గం
రవళించే హృదయంతో రాగం తీసి నీ కుంకుమ తిలకంతో కవితే రాసి
అంటుందమ్మా తన మనసే... నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నీ కోసమే.. ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

చరణం 2:

కళ్ళకు కలలే రెండు కాటుక సుగ్గులు చిందు కాబోయే కళ్యాణంలో
తనలో సగమే నీది నీలో సర్వం తనది అనురాగం మీ ఇద్దరిది
ఆ తారా తోరణమే మల్లెల హారం చేరాలి మురిపాల సాగర తీరం
అలరించే మీ జంట వలపుల పంటా శుభమంటూ దీవించే గుడిలోగంట
చెప్పాలి తనతో నీవే...నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నీ కోసమే.. ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
సంధ్యా కాంతుల్లోన శ్రావణిలా.. సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా.. శ్రీరస్తంటూ నీతో అంది ఇలా ... నిన్నే ప్రేమిస్తానని...

ఒక దేవత వెలసింది నీ కోసమే.. ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

pallavi:

ŏga devada vĕlasiṁdi nī kosame.. ī muṁgiḍa nilisiṁdi madhumāsame
ŏga devada vĕlasiṁdi nā kosame.. ī muṁgiḍa nilisiṁdi madhumāsame
saṁdhyā kāṁtullona śhrāvaṇilā.. sauṁdaryāle siṁde yāminilā
ĕnno janmalloni punnamilā.. śhrīrastaṁṭū nīdo aṁdi ilā ... ninne premistānani

ŏga devada vĕlasiṁdi nī kosame.. ī muṁgiḍa nilisiṁdi madhumāsame

saraṇaṁ 1:

virise vĕnnĕllona mĕrise kannullonā nī nīḍe sūsāḍamma
ĕnimidi dikkullonā niṁgili sukkallonā nī jāḍe vĕdigāḍamma
nī navve tana madilo amṛtavarṣhaṁ... nīlone vuṁdamma aṁdani svargaṁ
ravaḽiṁche hṛdayaṁto rāgaṁ tīsi nī kuṁkuma tilagaṁto kavide rāsi
aṁṭuṁdammā tana manase... ninne premistānani

ŏga devada vĕlasiṁdi nī kosame.. ī muṁgiḍa nilisiṁdi madhumāsame

saraṇaṁ 2:

kaḽḽagu kalale rĕṁḍu kāḍuga suggulu siṁdu kāboye kaḽyāṇaṁlo
tanalo sagame nīdi nīlo sarvaṁ tanadi anurāgaṁ mī iddaridi
ā tārā toraṇame mallĕla hāraṁ serāli muribāla sāgara tīraṁ
alariṁche mī jaṁṭa valabula paṁṭā śhubhamaṁṭū dīviṁche guḍilogaṁṭa
sĕppāli tanado nīve...ninne premistānani

ŏga devada vĕlasiṁdi nī kosame.. ī muṁgiḍa nilisiṁdi madhumāsame
saṁdhyā kāṁtullona śhrāvaṇilā.. sauṁdaryāle siṁde yāminilā
ĕnno janmalloni punnamilā.. śhrīrastaṁṭū nīdo aṁdi ilā ... ninne premistānani...

ŏga devada vĕlasiṁdi nī kosame.. ī muṁgiḍa nilisiṁdi madhumāsame