Oga devada velasimdi naa kosame

ఒక దేవత వెలసింది నా కోసమే
Year
Language

పల్లవి:

ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంటూ నాతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

చరణం 1:

విరిసే వెన్నెల్లోనా, మెరిసే కన్నుల్లోనా నీ నీడే చూశానమ్మా
ఎనిమిది దిక్కుల్లోన ముంగిలి చుక్కల్లోనా నీ జాడే వెతికానమ్మా
నీ నవ్వే నా మదిలో అమృతవర్షం ఒదిగింది నీలోనే అందని స్వర్గం
నునుసిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి మునుముందుకు వచ్చేనే చెలినే చూసి
అంటుందమ్మా నా మనసే నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

చరణం 2:

రోజా మొక్కను నాటి ప్రాణం నీరుగా పోసి పూయించా నీ జడ కోసం
రోజూ ఉపవాసంగా, హృదయం నైవేద్యంగా పూజించా నీ జత కోసం
నీరెండకు నీవెంటే నీడై వచ్చి మమతలతో నీగుడిలో ప్రమిదలు చేస్తా
ఊపిరితో నీ రూపం అభిషేకించి ఆశలతో నీ వలపుకు హారతులిస్తా
ఇన్నాళ్ళూ అనుకోలేదే నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంటూ నాతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

pallavi:

ŏga devada vĕlasiṁdi nā kosame ī muṁgiḍa nilisiṁdi madhumāsame
saṁdhyāgāṁtullona śhrāvaṇilā sauṁdaryāle siṁde yāminilā
ĕnno janmalloni punnamilā śhrīrastaṁṭū nādo aṁdi ilā
ninne premistānani

ŏga devada vĕlasiṁdi nā kosame ī muṁgiḍa nilisiṁdi madhumāsame

saraṇaṁ 1:

virise vĕnnĕllonā, mĕrise kannullonā nī nīḍe sūśhānammā
ĕnimidi dikkullona muṁgili sukkallonā nī jāḍe vĕdigānammā
nī navve nā madilo amṛtavarṣhaṁ ŏdigiṁdi nīlone aṁdani svargaṁ
nunusiggula mŏggalado muggulu vesi munumuṁdugu vachchene sĕline sūsi
aṁṭuṁdammā nā manase ninne premistānani

ŏga devada vĕlasiṁdi nā kosame ī muṁgiḍa nilisiṁdi madhumāsame

saraṇaṁ 2:

rojā mŏkkanu nāḍi prāṇaṁ nīrugā posi pūyiṁchā nī jaḍa kosaṁ
rojū ubavāsaṁgā, hṛdayaṁ naivedyaṁgā pūjiṁchā nī jada kosaṁ
nīrĕṁḍagu nīvĕṁṭe nīḍai vachchi mamadalado nīguḍilo pramidalu sestā
ūbirido nī rūbaṁ abhiṣhegiṁchi āśhalado nī valabugu hāradulistā
innāḽḽū anugolede ninne premistānani